Thursday, 9 December 2021

చిరంజీవి కుమార్తె సాహసం.. ఇలా ఫిక్స్ కావడం వెనుక ప్లాన్ ఏంటి? క్రేజీ అప్‌డేట్ వైరల్

చిరంజీవి వారసురాలిగా, చిత్రసీమలో క్యాస్టూమ్ డిజైనర్‌గా పాపులారిటీ సంపాదించిన .. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించి ఇటీవలే నిర్మాత అవతారమెత్తిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్‌పై విలక్షణ కథలను ప్రేక్షకుల ముందుకు తెచ్చి నిర్మాతగా తన మార్క్ చూపించాలని పక్కాగా ప్లాన్ చేసుకుంటోందట. ఈ క్రమంలోనే ఓ డేరింగ్ డిసీజన్ తీసుకొని 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టితో ఓ సినిమా ప్లాన్ చేసిందనే టాక్ సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమా కోసం కృతి శెట్టిని సంప్రదించగా ఆమె ఓకే చెప్పిందని సమాచారం. కాగా లేడీ ఓరియంటెడ్‌ సినిమా కోసం ఓ హీరోయిన్‌ని తీసుకోవాలంటే ఆమె గత సినిమాలు, నటన అనుభవం చూస్తుంటారు మేకర్స్. కానీ సుస్మిత మాత్రం కేవలం 'ఉప్పెన' సినిమాలో చూపిన అభినయాన్ని నమ్మి ఇలా సినిమా నిర్మించబోతోందంటే అది డేరింగ్ స్టెప్పే అని చెప్పుకోవాలి. రాజ్‌తరుణ్‌తో 'ఉయ్యాల జంపాల', నానితో 'మజ్ను' సినిమాలు రూపొందించిన విరించి వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఈ మూవీ కథ విన్న చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత స్వయంగా కృతి శెట్టిని రెఫర్ చేసి ఓకే చేయించిందని తెలుస్తోంది. సో.. నిజంగానే కృతి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసి సక్సెస్ అయితే ఇక ఆమె కెరీర్‌కి తిరుగే ఉండదని చెప్పుకోవచ్చు. మరోవైపు కృతి నటించిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా ఈ నెల 24న విడుదలకు సిద్దమవుతోంది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DI39vc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...