Thursday, 9 December 2021

1945 సినిమా.. ఏడాది చివరన థియేటర్లో రానా రచ్చ

చేతిలో ప్రస్తుతం ఎన్ని సినిమాలున్నాయో సరిగ్గా లెక్కపెట్టలేం కూడా. బాహుబలి తరువాత రానాకు అవకాశాలు చుట్టుముట్టాయి. కానీ రానా మాత్రం ఆచితూచి ప్రాజెక్ట్‌లను ఎంచుకున్నాడు. అరణ్య అంటూ ఓ ప్రయోగాన్ని చేశాడు. ఇక ఇప్పుడు మరో ప్రయోగాత్మక, దేశ భక్తి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందకు ప్రయత్నిస్తున్నారు. భిన్న రకాల చిత్రాలను చేసేందుకు ముందుండే రానా ఇప్పుడు 1945 అనే సినిమాతో ఆడియెన్స్ ముందకు రాబోతోన్నాడు. ఓ ఈ పీరియడ్ డ్రామా. ఈ చిత్రాన్ని సత్యశివ తెరకెక్కించారు. ఈ ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సీ కళ్యాణ్ భారీగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 1945 అనే సినిమా ఈ ఏడాది డిసెంబర్ 31న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో రానా బ్రిటీష్ జెండాను కాల్చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. స్వాతంత్ర్య సమర యోధుడి పాత్రను రానా పోషించారు. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. సత్యరాజ్, నాజర్, ఆర్జే బాలాజీ వంటి వారు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. సత్య కెమెరామెన్‌గా, గోపీ కృష్ణ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి రానా సినిమాతో ఈ ఏడాది ముగిసేట్టు కనిపిస్తోంది. కానీ పుష్ప, ఆర్ఆర్ఆర్ ప్రభంజనంలో రానా నిలబడతాడా? లేదా? అన్నది చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yhCKDy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...