Sunday, 19 December 2021

హీరోయిన్‌కు నాటు ప్రశ్న.. ఆ సీక్రెట్ చెప్పమన్న నెటిజన్.. కూల్‌గా పూనమ్ రిప్లై

కాశ్మీర్ యాపిల్‌లా ఉండి అంద చందాల‌తో క‌వ్వించే ముద్దుగుమ్మ పూన‌మ్ బాజ్వా. మొద‌టి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ సొగ‌సుల సోయ‌గం త‌ర్వాత తెలుగులో బాస్‌, ప‌రుగు వంటి చిత్రాల‌తో మెప్పించింది. అలాగే త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ చిత్రాల్లోనూ ఆక‌ట్టుకుంది. ఎంత అంద‌ముంటే ఏం లాభం అవ‌గింజంత అదృష్టం కూడా ఇండ‌స్ట్రీలో కలిసి రావాలి. ఆ ల‌క్ లేక‌పోవ‌డంతో ఈ అమ్మ‌డు సినిమాల్లో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. అడ‌పా ద‌డ‌పా సినిమాల్లో త‌న ఉనికిని చాటుకుంటూనే ఉంది. ఇక సోష‌ల్ మీడియాలో అయితే ఈమె హాటు అందాల ఫొటోల‌తో ర‌చ్చ చేస్తూనే వ‌స్తుంది. కేవ‌లం సోష‌ల్ మీడియాలో ఫొటోల‌తోనే ఏం చేస్తాం.. అభిమానుల‌తో ముచ్చ‌టిస్తే స‌రిపోతుందిగా అని అనుకుందేమో కానీ.. ఈ అమ్మ‌డు ఉన్న‌ట్లుండి ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చింది. త‌న సోల్ మేట్ సునీల్ రెడ్డి, తన కుటుంబం ఇత‌ర‌త్రా వివ‌రాల‌ను తెలియజేస్తూనే వారి ఫొటోల‌ను తాను చీర క‌ట్టులో ఉన్న ఫొటోల‌ను అభిమానుల రిక్వెస్ట్ మీద పోస్ట్ చేస్తూ వ‌చ్చింది. అయితే ఈ క్ర‌మంలో ఈమెకు ఓ కొంటె ప్ర‌శ్న ఎదురైంది. అలాంటి ప్ర‌శ్న ఎదురైంది క‌దా అని, కంగారు ప‌డ‌లేదు. చాలా కూల్‌గానే స‌మాధానం ఇచ్చింది. ఇంత‌కీ పూన‌మ్ బాజ్వాకి ఎదురైన కొంటె ప్ర‌శ్న ఏంటి? ఆమె దానికి ఎలా బ‌దులిచ్చింద‌నే వివ‌రాల్లోకి వెళితే, ఓ నెటిజ‌న్ పూన‌మ్ బాజ్వాను మీ సెక్సీ స్ట్ర‌క్చ‌ర్ వెనుకున్న సీక్రెట్ ఏంటి? అని ప్ర‌శ్న వేశాడు. ఇది కొంటె ప్రశ్నే కాదు.. నాటు ప్ర‌శ్న అని కూడా అనుకోవ‌చ్చు. అయితే దానికి పూన‌మ్ కూడా అంతే తెలివిగా, కూల్‌గా నేను ప్ర‌తిరోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా యోగ చేయ‌డ‌మే అని స‌మాధానం చెబుతూ తాను యోగ చేస్తూనే ఫొటోను షేర్ చేసింది. ఈ స‌మాధానంతో ఇక స‌ద‌రు కొంటె ప్ర‌శ్న వేసిన నెటిజ‌న్‌కు నోట మాట రాలేదు పాపం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pccR4Q
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...