టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు అజయ్. విలన్‌గా టాప్ ప్లేస్‌లో కొనసాగాడు. విలన్‌గానే కాకుండా.. సపోర్టింగ్ రోల్స్‌లోనూ దుమ్ములేపేశాడు. అయితే హీరోగా ప్రయత్నించి చేతులు కాల్చుకున్నాడు. సారాయి వీర్రాజు అంటూ చేసిన ఈ సినిమా బెడిసి కొట్టేసింది. అప్పటి నుంచి మళ్లీ హీరోగా ప్రయత్నాలేవీ చేయలేదు. విలన్, కారెక్టర్ పాత్రలు వేస్తూ తన కంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు. విక్రమార్కుడు, పోకిరి వంటి సినిమా అజయ్ కెరీర్‌ను టర్న్ చేశాయి. ఇష్క్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. అలా అజయ్ మాత్రం ఇప్పటికీ దూసుకుపోతూనే ఉన్నాడు. చివరగా వచ్చిన అనుభవించు రాజా సినిమాలో అజయ్ మళ్లీ ఆకట్టుకున్నాడు. అజయ్ పాత్రకు మంచి పేరు వచ్చింది. అలా అజయ్ సినీ కెరీర్ మంచి ఫాంలోనే ఉంది. అజయ్ ఫ్యామిలీ గురించి మాత్రం ఎక్కువగా ఎవ్వరికీ తెలియదు. ఆయన భార్య శ్వేత మోడల్. మిస్ ఇండియా వంటి పోటీల్లో పాల్గొంది. తాజాగా అజయ్ తన భార్యతో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. లండన్‌లో గడిపిన క్షణాలను తలుచుకున్నాడు. తన భార్య పక్కనే ఉండగా.. అజయ్ మాత్రం మంచి స్పీడులో ఉన్నాడు. చేతిలో మందు గ్లాసును పట్టుకుని కనిపించాడు. ఇక ఆయన భార్య మాత్రం టీయో, కాఫీయో తాగుతూ కనిపించింది. మొత్తానికి అజయ్‌ను, అతని భార్యను ఇలా చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. లండన్ డైరీస్ అంటూ షేర్ చేసిన అజయ్.. అక్కడ బాగానే ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32Q1t61
v
No comments:
Post a Comment