Friday, 3 December 2021

రష్మిక మందన్న లిప్ కిస్ ఫొటో... పర్‌ఫెక్ట్ జంట అంటూ కామెంట్స్ చేస్తోన్న నెటిజన్స్

ద‌క్షిణాది భాష‌లైన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌లోనే కాదు.. బాలీవుడ్ సినిమాల‌తోనూ బిజీగా ఉంటున్న శాండిల్ వుడ్ బ్యూటీ సినిమాల‌తోనే కాదు..సోష‌ల్ మీడియాలోనూ య‌మా యాక్టివ్‌గా ఉంది. త‌నకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను నెటిజ‌న్స్‌ను ఆక‌ట్టుకుంటోంది. తాజాగా ఈమె పోస్ట్ చేసిన కిస్సింగ్ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంత‌కీ ర‌ష్మిక పోస్ట్ చేసిన కిస్సింగ్ ఫొటో ఆమెదే.. ఇంత‌కీ ఆమె ఎవ‌రినీ కిస్ చేస్తుందో తెలుసా.. త‌న పెంపుడు కున్న పూచ్ ఓరాని. ఫోటోతో పాటు వెల్‌క‌మ్ హోం కిస్సెస్ అనే క్యాప్ష‌న్ కూడా పోస్ట్ చేసింది ర‌ష్మిక‌. ఇప్పుడా ఫొటో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ఇక నెటిజ‌న్స్ ఊరుకుంటారా? ప‌ర్‌ఫెక్ట్ క‌పుల్‌.. దాని అదృష్టం అలా ఉంది.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రీసెంట్‌గానే ఆమె పారిస్‌కు వెకేష‌న్‌కు వెళ్లింది. అక్క‌డ ఎంజాయ్ చేసి వ‌చ్చింది. ఆమె ఇంటికి రాగానే అద్భుత‌మైన స్వాగ‌తం ఆమెకు దొరికింది. ఆ స్వాగ‌తం ఇచ్చిందెవ‌రో కాదు.. ఆమె పెంపుడు కుక్క పూచ్ ఓరా. ఈ మ‌ధ్య ర‌ష్మిక మంద‌న్న జంతు ప్రేమికురాలిగా మారిపోయింది. పూచ్ ఓరాను షూటింగ్స్‌కు, షాపింగుల‌కు తీసుకెళుతుంది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ర‌ష్మిక ఇప్పుడు తెలుగు, త‌మిళ చిత్రాల‌తో పాటు హిందీ చిత్రాల‌తో బిజీగా ఉంది. త్వ‌ర‌లోనే అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన పాన్ ఇండియా మూవీ ద్వారా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది. ఇందులో ఆమె శ్రీవ‌ల్లి అనే పాత్ర‌లో న‌టించింది. దీంతో పాటు రెండు బాలీవుడ్ సినిమాల్లోనూ ఆమె న‌టిస్తుంది. అందులో ఓ సినిమా మిష‌న్ మ‌జ్ను. ఈ సినిమా చిత్రీక‌ర‌ణను ర‌ష్మిక పూర్తి చేసుకుంది. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా శాంత‌న్ భ‌గ్చీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇది రియ‌ల్ ఇన్‌సిడెంట్‌ను బేస్ చేసుకుని రూపొందిస్తున్నారు. పాకిస్థాన్ అణ్వాయుధాల‌ను త‌యారు చేస్తుంద‌ని తెలుసుకోవ‌డానికి ఇండియా నిర్వ‌హించిన అతి పెద్ద కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ ఆధారంగానే ఈ మూవీ తెర‌కెక్కుతోంది. మే 13న విడుద‌లకు స‌న్న‌ద్ధం చేస్తున్నారు. దీంతో పాటు గుడ్ బై అనే మ‌రో సినిమాలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి న‌టిస్తోంది. వికాస్ భ‌ల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈసినిమాలో అమితాబ్ కుమార్తె పాత్ర‌లో ర‌ష్మిక మంద‌న్న న‌టించ‌నుంది. ఈ సినిమా కూడా షూటింగ్ ద‌శ‌లోనే ఉంది. వ‌చ్చే ఏడాది ద్వితీయార్థంలో గుడ్ బై సినిమా విడుద‌ల‌య్యే అవ‌కాశం క‌నిపిస్తుంది. అంటే డిసెంబ‌ర్ నుంచి చూసుకుంటే వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్‌లోపు ఈ బ్యూటీ మూడు భారీ చిత్రాల‌తో సంద‌డి చేయ‌నుంది. ఇది కాకుండా శ‌ర్వానంద్‌తో క‌లిసి ఆడ‌వాళ్లు మీకు జోహార్లు సినిమాలోనూ న‌టిస్తుంది. ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగులో సూపర్ స్టార్ మహేశ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వంటి వారితో జత కట్టింది. ఇప్పుడు అల్లు అర్జున్‌తోనూ సై అనేసింది. ఒకవైపు స్టార్ హీరోలు, మరో వైపు మీడియం బడ్జెట్ హీరోలను బ్యాలెన్స్ చేస్తూ స్టార్ హీరోయిన్‌గా తనదైన ఇమేజ్‌తో దూసుకెళ్తోంది రష్మిక.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZVmv2g
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...