Tuesday, 21 December 2021

యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ ప్లాన్.. అదే టార్గెట్‌గా స్టెప్స్!! మెగా మేనల్లుడి స్కెచ్ ఇదే..

ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఆయన హీరోగా రూపొందిన 'రిపబ్లిక్' రిలీజ్ సమయంలో సాయి తేజ్ బైక్ యాక్సిడెంట్ పాలై తీవ్ర గాయాలతో చాలా రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత కొద్ది రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకున్న ఆయన పూర్తిగా కోలుకొని తిరిగి సినిమాలపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఎప్పటిలానే రెగ్యులర్ సినిమాలతో బిజీ అయ్యేందుకు ఆయన సిద్దమయ్యారట. యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్‌ ఏ ప్రాజెక్టు చేయబోతున్నారనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. దీంతో సాయి తేజ్ సినిమా అప్‌డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆయన ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయి తేజ్.. ఓ కమర్షియల్ మాస్ సినిమా చేయడానికి రెడీ అయ్యారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు తనతో ప్రత్యేక సాన్నిహిత్యం ఉన్న కొంతమంది యువ దర్శకులతో చర్చిస్తున్నారట. ఈ క్రమంలోనే డైరెక్టర్ సంపత్ నందితో చర్చలు ముగిశాయని తెలుస్తోంది. సంపత్ నేరేట్ చేసిన కథ విన్న సాయి తేజ్ వెంటనే సెట్స్ పైకి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని అంటున్నారు. ఇటీవల ‘సిటీమార్‌’ సినిమాతో హిట్‌ కొట్టిన ఈ దర్శకుడితో సినిమా చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తోందట. మాస్ ఆడియన్స్ టార్గెట్‌గా భారీ రేంజ్‌లో ఈ మూవీ చిత్రీకరించాలని స్కెచ్చేస్తున్నారట. కాగా, సుకుమార్‌ శిష్యుడు కార్తిక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉందట. దీంతో పాటు సినిమాను ప్యారలల్‌గా నడిపించాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు టాక్. సో.. ఇదే నిజమైతే వచ్చే ఏడాది సాయి ధరమ్ తేజ్ ఫుల్ బిజీగా ఉండటం ఖాయమే మరి!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yMiqKJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...