Tuesday, 21 December 2021

సెకండ్ హ్యాండ్ ఐటమ్ సమంత.. అప్పనంగా 50 కోట్లు కొట్టేసింది! దిమ్మతిరిగే కౌంటరిచ్చిన స్టార్ హీరోయిన్

అక్కినేని నాగ చైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత స్టార్ హీరోయిన్ సమంత.. నిత్యం ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. అక్కినేని కుటుంబంతో కట్ చేసుకోవడాన్ని తప్పుబట్టిన కొందరు ఆమెపై తెగ ట్రోల్స్ చేశారు. అయితే వాటన్నింటినీ తిప్పికొట్టి తన కెరీర్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టిన సమంతకు తాజాగా మరోసారి అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. సమంతపై వల్గర్ కామెంట్ చేశాడు ఓ నెటిజన్. ఇది సామ్ దృష్టికి రావడంతో సదరు నెటిజన్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చేసింది. నాగ చైతన్యతో సమంత విడాకుల ఇష్యూపై ఎన్నో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆమె కోట్లలో భరణం తీసుకుందంటూ పెద్ద ఎత్తున రూమర్స్ నడిచాయి. అయితే తాజాగా అదే అంశాన్ని లెక్కలోకి తీసుకొని షాకింగ్ కామెంట్ చేశాడు ఓ నెటిజన్. 'విడాకులు తీసుకుని చెడిపోయిన సెకెండ్ హ్యాండ్ ఐటమ్ సమంత. ఓ జెంటిల్మెన్ దగ్గర ఆమె 50 కోట్ల రూపాయలు బ్లాక్ మనీగా తీసుకుంది' అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ చూసిన సమంత.. అతనిపై విరుచుకుపడుతూ దిమ్మతిరిగే కౌంటరిచ్చింది. ‘నీ ఆత్మకు ఆ దేవుడు శాంతి కలిగించాలి’ అంటూ కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చింది. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇలాంటి సందర్భాల్లో సమంత డేరింగ్‌నెస్‌ ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 'ఇలాంటి సందేశాలను ఇలా తిప్పికొట్టాల్సిందే. సూపర్ సమంత' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవలే విడుదలైన 'పుష్ప' చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ చేసి యావత్ భారత దేశాన్ని ఉర్రూతలూగించింది సమంత. ఈ సాంగ్‌పై పలు వివాదాలు రాజుకున్నా కూడా యూట్యూబ్ రికార్డ్స్ తిరగరాస్తుండటం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FnKTJo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...