Monday, 13 December 2021

ఐటెం పాటకు రెచ్చిపోయి స్టెప్పులేస్తూ అరియనా హల్చల్! సమంతను మరిపించే వయ్యారాలు.. వీడియో వైరల్

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే ట్రెండింగ్ టాపిక్. అదే పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ 'ఉ అంటావా మావ.. ఉఊ అంటావా మావ'. స్టార్ హీరోయిన్ ఆడిపాడిన ఈ పాట ఇటీవలే విడుదలై సోషల్ మీడియాను షేక్ చేసేసింది. సౌత్ ఇండియన్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ వ్యూస్ రాబట్టిన పాటగా ఆన్‌లైన్ వేదికలపై రచ్చ చేస్తోంది. ఇక ఈ వీడియోను డబ్ స్మాష్ చేసే వాళ్ళైతే లక్షల్లో ఉన్నారు. ఇదే బాటలో వెళ్ళింది బిగ్ బోస్ బ్యూటీ అరియానా. బిగ్ బాస్ షో ద్వారా తన పాపులారిటీని పెంచుకొని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది అరియానా. ఇటీవల రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొని రచ్చ రచ్చ చేసిన ఈ చిన్నది.. ఇప్పుడు సమంత చేసిన ఐటెం సాంగ్‌తో మరోసారి సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. ''ఉ అంటావా మావ.. ఉఊ అంటావా మావ'' అని వస్తున్న బీట్‌కి తగ్గట్లు రొమాంటిక్ మూమెంట్స్‌తో మత్తెక్కించింది అరియానా. ఇక ఆమె అందాల ఆరబోత అయితే పీక్స్ అని చెప్పుకోవాలి. ఈ వీడియోను తన ఇన్స్‌స్టా ద్వారా అరియానా షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసి నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు వెరీ వెరీ హాట్ అని అంటుండగా.. ఇంకొందరు ఇదేంటి సడెన్‌గా అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ పాటతో సమంతను మరిపించేలా రెచ్చిపోయింది అరియానా అని మాత్రం చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో తొలిసారి సమంత ఐటెం సాంగ్ చేసింది. ఈ పాటకు, సమంత స్థాయికి తగ్గట్లు దేవీ శ్రీ బాణీలు కట్టారు. అయితే ఇందులో వాడిన పదాలపై అక్కడక్కడా విమర్శలు వస్తున్నా కూడా సాంగ్ మాత్రం నెట్టింట రచ్చ చేస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31SoB3Q
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...