Friday, 17 December 2021

పుష్ప సినిమాపై రామ్ చరణ్ కామెంట్స్.. మైండ్ బ్లోయింగ్ సుక్కు!!

స్టైలిష్ స్టార్ నేడు (డిసెంబర్‌ 17) రాజ్‌గా థియేటర్స్‌లో అడుగుపెట్టేశారు. పుష్ప ది రైజ్ సినిమాలో మాస్ లుక్కుతో దర్శనమిచ్చి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. సుకుమార్ రూపొందించిన ఈ మూవీలో అల్లు అర్జున్‌ది వన్ మ్యాన్ షో అనే టాక్ బయటకొచ్చింది. ఇతర నటీనటులు, సుకుమార్ దర్శకత్వ ప్రతిభపై మిశ్రమ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ సినిమాకు ఫుల్ సపోర్ట్ అందిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు మెగా పవర్ స్టార్ . 'బన్నీ.. పుష్ప సినిమా సూపర్‌ హిట్‌గా నిలవబోతోంది. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ అంతా ఎంతో కష్టపడ్డారు. సుకుమార్‌ గారు, మీ విజన్ మైండ్‌ బ్లోయింగ్‌. రష్మికతోపాటు ఈ చిత్రంలో భాగమైన వారందరికీ శుభాకాంక్షలు' అని పేర్కొంటూ ట్విటర్‌‌లో ట్వీట్ చేశారు రామ్‌ చరణ్‌. ఆయన చేసిన ఈ ట్వీట్ చూసి మెగా అభిమాన వర్గం పెద్ద ఎత్తున స్పందిస్తోంది. అల్లు అర్జున్- రామ్ చరణ్ కలిసి దిగిన ఫొటోస్ షేర్ చేస్తూ 'పుష్ప' సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. ముత్తంశెట్టి మీడియా అసోషియేషన్‌లో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు భారీ బడ్జెట్ కేటాయించి ఈ ‘పుష్ప’ మూవీ రూపొందించారు. సినిమా విడుదల ముందు ప్రేక్షకుల ముందుకు తెచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొల్పగా.. సమంత స్పెషల్ సాంగ్ ఆ అంచనాలకు రెక్కలు కట్టింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు అన్ని ఇండస్ట్రీల ప్రముఖుల నుండి మంచి సపోర్ట్ లభించడం విశేషం. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన శ్రీ వల్లి పాత్రలో రష్మిక మందన నటించగా దాక్షాయణిగా అనసూయ, మంగళం శీనుగా సునీల్ నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GQPxQb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...