Monday, 20 December 2021

పవన్ కళ్యాణ్‌తో సిట్టింగ్.. పక్కా ప్లాన్‌తో క్రిష్ స్టెప్స్! అద్భుతమైన రోజంటూ డైరెక్టర్ ఓపెన్

రీ- ఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడు పెంచారు. ఇటీవల 'వకీల్ సాబ్' సక్సెస్ ఖాతాలో వేసుకున్న ఆయన.. అదే జోష్‌లో వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ క్రిష్‌తో '' సినిమా చేస్తున్నారు. 17వ శతాబ్దం నేపథ్యంలో పీరియాడికల్‌ డ్రామాగా పదునైన కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథ కళ్ళకు కట్టినట్లు చూపాలని ప్లాన్ చేసిన క్రిష్.. ఎప్పటికప్పుడు స్క్రిప్ట్‌కి మెరుగులు దిద్దుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో స్క్రిప్ట్ డిస్కషన్స్ చేస్తూ మెరుగైన అవుట్‌పుట్ వచ్చేలా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్‌కి స్క్రిప్ట్ చూపిస్తూ ఆయనతో చర్చిస్తున్న ఓ పిక్ షేర్ చేశారు డైరెక్టర్ క్రిష్. ఈ మేరకు ''పవన్‌తో హరిహర వీరమల్లు స్క్రిప్ట్ రీడింగ్ సెషన్. ఇది అద్భుతమైన రోజు. కొత్త సంవత్సరంలో ఉత్తేజకరమైన షెడ్యూల్‌ ప్రారంభించబోతున్నాం'' అని పేర్కొన్నారు క్రిష్. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో నందమూరి బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి అనే హిస్టారికల్ మూవీ చేసి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న క్రిష్.. ఈ సారి పవన్ కళ్యాణ్‌తో అలాంటి ప్రయోగమే చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఇదే ఆయనకు తొలి పీరియాడికల్ మూవీ కానుండటం విశేషం. ఇకపోతే ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మ్యూజిక్ దిగ్గజం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FdchcY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...