Monday, 20 December 2021

రాధేశ్యామ్‌ నుంచి కృష్ణంరాజు లుక్ రివీల్.. అలాంటి పాత్రలో లెజెండరీ యాక్టర్.. పోస్టర్ వైరల్

ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు త్వరలోనే రాబోతోంది. బాహుబలి తర్వాత 'సాహో' మూవీతో కాస్త నిరాశ పర్చిన ప్రభాస్.. ఆ నిరాశను రాధేశ్యామ్ సినిమాతో పూడ్చేయాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో భారీ సినిమాలో భాగమవుతూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్‌తో తన అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సీనియర్‌ నటుడు కృష్ణంరాజు లుక్‌ రివీల్ చేసి సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టారు. రాధేశ్యామ్ సినిమాలో మహాజ్ఞాని పరమహంస పాత్రలో రెబల్ స్టార్ కృష్ణం రాజు కనిపించబోతున్నానని చెప్పి ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం నింపిన చిత్రయూనిట్.. తాజాగా ఆయన లుక్ రివీల్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో గుబురు గెడ్డంతో అదిరిపోయే లుక్‌లో కనిపించారు కృష్ణం రాజు. ఈ పాత్ర కోసం ఆయన ఏడాదిగా గడ్డం పెంచారట. పాత్రకు సరిగ్గా యాప్ట్ అయ్యేలా ఉన్న ఆయన లుక్ విడుదలైన కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టర్ చూసి 'సూపర్' అంటూ కామెంట్స్ పెడుతున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. కృష్ణం రాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై పాన్‌ ఇండియా మూవీగా భారీ రేంజ్‌లో ఈ మూవీ తెరకెక్కించారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రభాస్ లుక్స్, సాంగ్స్ సినిమాపై హైప్ పెంచేశాయి ప్యారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుంచబోతున్నారు. చిత్రంలో ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే నటించింది. వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. గతంలో ప్రభాస్‌తో కలిసి 'బిల్లా', 'రెబల్'‌ సినిమాల్లో నటించారు కృష్ణం రాజు. చివరిసారిగా 2015 సంవత్సరంలో వచ్చిన 'రుద్రమదేవి' మూవీలో గణపతి దేవుడుగా కనిపించారు. మళ్ళీ ఇన్నేళ్ల గ్యాప్‌ తర్వాత ఆయన వెండితెరపై కనిపించనుండటం, అది కూడా ప్రభాస్ ప్రతిష్టాత్మక సినిమా రాధేశ్యామ్‌లో కావడం జనాల్లో ఆసక్తి నెలకొల్పింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32aWSvn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...