టాలీవుడ్ లెక్కల మాస్టర్ దర్శకత్వంలో వచ్చిన ‘’ చిత్రం ఈ శుక్రవారం విడుదలై యావరేజ్ టాక్ రాబట్టింది. అల్లు అర్జున్ పెర్ఫామెన్స్‌లో తగ్గేదేల్యా అంటూ విశ్వరూపం చూపించినప్పటికీ సుక్కూ మాస్టర్ లెక్క తేడా కొట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే పెద్ద సినిమా ఏది రిలీజ్ అయినా.. బాగుంది.. బాలేదని మాటలను మిక్స్ అయ్యి వస్తుంటాయి.. ఫైనల్‌గా సినిమాకి కలెక్షన్స్ వస్తే బొమ్మ హిట్‌కిందే లెక్క. ఆ కలెక్షన్ల లెక్కలు ఎక్కాలు పక్కనపెడితే దర్శకుడిగా సుకుమార్‌కి క్లీన్ ఇమేజ్ ఉంది. ప్రతి దర్శకుడికి ఎదురయ్యే కాపీ కథల్లాంటి వివాదాల జోలికి పోకుండా వినోదాత్మకంగా సినిమాలు తీయడంలో సుక్కు మాస్టర్ పక్కా లెక్కల్లో ఉంటారు. అయితే ఆ లెక్క తప్పిందని.. ‘పుష్ప’ కథ తన దగ్గర నుంచి కొట్టేశారంటూ సీనియర్ జర్నలిస్ట్ పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. కవి, రచయిత, నాటకరంగంలో ప్రావీణ్యం ఉన్న ఆదినారాయణ అనే జర్నలిస్ట్ చాలా ఏళ్లుగా జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. సినిమాలపై ఉన్న మక్కువతో సొంతంగా కథలు రాస్తుంటారు. ఇక సినిమా రివ్యూలు రాయడంలో కూడా అతనికి ప్రత్యేక శైలి. ‘రంగస్థలం’ సినిమా రివ్యూకి దర్శకుడి సుకుమార్ ప్రశంసలు దక్కించుని ఆయన్ని మీట్ అయ్యే అవకాశాన్ని దక్కించుకున్నారు. అప్పుడే కేజీఎఫ్ బ్యాగ్రౌండ్ స్థాయి కథ కావాలని ఈ జర్నలిస్ట్‌ని సుకుమార్ అడిగారని.. అప్పుడు రెడ్ శాండిల్ నేపథ్యంలో ‘పుష్ప’ లైన్ ఇచ్చానని.. మాస్ ఎలిమెంట్స్ కావాలంటే.. కంటెంట్ కూడా ఇచ్చానని చెప్తూ ఆ తరువాత ఏమైందో.. తన కథను ఎలా నొక్కేశారో వివరిస్తూ వ్యగ్యంగా పోస్ట్ పెట్టారు. అంతే కాదు తాను రాసిన కంటెంట్.. మెయిల్స్ కూడా ఈ పోస్ట్‌లో జత చేయడం విశేషం. పుష్ప చిత్రంలో ఊ అంటూ ఉహూ అంటావా మామా? సాంగ్‌ని పేరడీ చేస్తూ తనకి జరిగిన అన్యాయాన్ని వివరించాడు ఆది నారాయణ. సుక్కూ అంటే కాపీ క్యాటూకాజేయుటలో అతడే గ్రేటూ(టిట్టీటి టిట్టీటి టిట్టీటీ)-------------------------కథ లేదు కాకర లేదు..స్టోరీ లేపుటలో తిరుగే లేదుసుక్కూ అంటే కాపీ క్యాటూకాజేయుటలో అతడే గ్రేటూఊ.. అంటావా వేమాఊహూ.. అంటావా వేమా(టిట్టీటి టిట్టీటి టిట్టీటీ) రంగస్థలం రివ్యూ రాస్తేరారమ్మని పిలిచేడూ..కాపీ ఇచ్చీ కూర్చోబెట్టీకూపీలెన్నో లాగేడు..సుక్కూ అంటే కాపీ క్యాటూకాజేయుటలో అతడే గ్రేటూఊ.. అంటావా వేమాఊహూ.. అంటావా వేమా(టిట్టీటి టిట్టీటి టిట్టీటీ) కేజీఎఫ్ రేంజిలోనకథ కావాలన్నాడూ..నా దగ్గర రెండూ లైన్లు..ఒకటేమో ఇసుకదుందీరెండోదేమో ఎర్రచందనమన్నా..సుక్కూ అంటే కాపీ క్యాటూకాజేయుటలో అతడే గ్రేటూఊ.. అంటావా వేమాఊహూ.. అంటావా వేమా(టిట్టీటి టిట్టీటి టిట్టీటీ) రెడ్ శాండిల్ స్టోరీ నచ్చీమాస్ ఎలిమెంట్ లేదన్నాడూడ్రైవర్ లేడా? ఎర్ర కూలీ లేడా?ఇంతకన్నా ఏముందన్నాసుక్కూ అంటే కాపీ క్యాటూకాజేయుటలో అతడే గ్రేటూఊ.. అంటావా వేమాఊహూ.. అంటావా వేమా(టిట్టీటి టిట్టీటి టిట్టీటీ) సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీఎన్నో పట్టుకెళ్లీ ఇచ్చేవచ్చాసుకుమార్ అంటే పెద్ద డైరెట్రూఅంతా మంచే నమ్మా నేను..సుక్కూ అంటే కాపీ క్యాటూకాజేయుటలో అతడే గ్రేటూఊ.. అంటావా వేమాఊహూ.. అంటావా వేమా(టిట్టీటి టిట్టీటి టిట్టీటీ) కథ మొత్తం దొబ్బేశాకనన్ను దూరం పెట్టేశాడు..వాట్సప్పూ బందు పెట్టీనా లైన్ మొత్తం కట్టు జేసీ..సుక్కూ అంటే కాపీ క్యాటూకాజేయుటలో అతడే గ్రేటూఊ.. అంటావా వేమాఊహూ.. అంటావా వేమా(టిట్టీటి టిట్టీటి టిట్టీటీ) మంచి లేదు చెడ్డాలేదూదొబ్బిందానికి చిల్లీ కానీ లేదూచెప్పేవేమో శ్రీరంగ నీతులుచేసేవేమో దొంగా పనులుసుక్కూ అంటే కాపీ క్యాటూకాజేయుటలో అతడే గ్రేటూఊ.. అంటావా వేమాఊహూ.. అంటావా వేమా(టిట్టీటి టిట్టీటి టిట్టీటీ) ఊ.. అంటాన్రా ఆదీఊహూ అంటే పాపం తగిలేన్రా.. మాకీ(టిట్టీటి టిట్టీటి టిట్టీటీ)...
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3p97Om2
v
No comments:
Post a Comment