Thursday, 16 December 2021

బన్నీ బ్రదర్.. పార్టీకి రెడీగా ఉండు.. ఆగలేకపోతున్నా! సోనూ సూద్ కామెంట్స్ వైరల్

కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత ఒక్కొక్కటిగా పెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. రీసెంట్‌గా బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ' సక్సెస్‌ దర్శకనిర్మాతలకు ధైర్యాన్నిచ్చింది. ఈ క్రమంలోనే స్టైలిష్ స్టార్ '' మూవీతో భారీ రేంజ్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. బన్నీ కెరీర్‌లో మొదటి పాన్ ఇండియా సినిమాగా డిసెంబర్ 17న ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున బెస్ట్ విషెస్ అందిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ స్టార్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ''బన్నీ బ్రదర్.. ‘పుష్ప’ మూవీ హిందీ వెర్షన్ భారీ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఉంది. సక్సెస్ పార్టీ కోసం సిద్ధంగా ఉండు'' అంటూ సోనూసూద్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. దీంతో ఈ ట్వీట్ చూసిన బన్నీ ఫ్యాన్స్ ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోనూ సూద్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముత్తంశెట్టి మీడియా అసోషియేషన్‌లో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ కేటాయించి ఈ ‘పుష్ప’ మూవీ రూపొందించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొల్పగా.. సమంత స్పెషల్ సాంగ్ ఆ అంచనాలకు రెక్కలు కట్టింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతోన్న ఈ సినిమాకు అన్ని ఇండస్ట్రీల నుండి మంచి సపోర్ట్ లభిస్తుండటం విశేషం. ఈ మూవీలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ రోల్ పోషించగా.. శ్రీ వల్లి పాత్రలో రష్మిక, దాక్షాయణిగా అనసూయ నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dWzfsL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...