Wednesday, 8 December 2021

ఓ చిన్న సెషన్ అయినా చాలు!.. ఎక్కడికి వెళ్లినా సరేనంటోన్న నిధి అగర్వాల్

ఇస్మార్ట్ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే అల్లరి మామూలుగా ఉండదు. అందాల ఆరబోతలో, ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవడంలో నిధి రూట్ సపరేట్. నిధి అగర్వాల్ తన ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటుంది. తన పేరు మీద అభిమానులు చేసే మంచి పనులను ప్రోత్సహిస్తుంటుంది.. ఫ్యాన్స్ చేసే కార్యక్రమాలను గురించి అందరికీ చెబుతు ఇన్‌స్పైర్ చేస్తుంటుంది నిధి అగర్వాల్. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ముందుంటుంది. రష్మిక మందనను వెనక్కి నెట్టేసి.. నేషనల్ క్రష్‌గా నిధి అగర్వాల్ అవతరించింది. అలాంటి నిధి అగర్వాల్ ఈ ఏడాది తమిళ నాట తన హవాను చూపించింది. సంక్రాంతి బరిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పలకరించింది. శింబు, జయం రవి సినిమాల్లో నిధి నటించింది. కానీ మళ్లీ కోలీవుడ్‌లో అవకాశం రాన్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు తెలుగులో రెండు ప్రాజెక్ట్‌లున్నాయి. అందులో ఒకటి భారీ చిత్రం. మరొకటి మీడియం రేంజ్ చిత్రం. పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్‌లో హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇక మహేష్ బాబు మేనళ్లుడు గల్లా అశోక్ డెబ్యూ మూవీ ‘హీరో’లో నిధి అగర్వాల్ నటిస్తోంది. నిధి అగర్వాల్ సినిమాల ద్వారా కాకుండానే యాడ్స్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తోంది. తాజాగా నిధి అగర్వాల్ హెడ్ ఫోన్ గురించి ప్రకటన ఇచ్చింది. నా ఫేవరేట్ సాంగ్స్ వినే ఆ చిన్న సెషన్ కంటే నాకు ఆనందాన్ని మరొకటి ఇచ్చేది ఏదీ ఉండదు... నేను ఎక్కడికి వెళ్లినా సరే అంబ్రేన్ ఇండియా నెక్ బ్యాండ్‌ను నాతో పాటు తీసుకెళ్తుంటాను అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. నా మూడ్‌ను మార్చేందుకు అది బెస్ట్ అంటూ నిధి అగర్వాల్ ఆ ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3IysP0U
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...