Friday, 24 December 2021

హాస్పిటల్‌లో జాయిన్ అయిన స్టార్ కమెడియన్ వడివేలు

సీనియర్ స్టార్ కమెడియన్ కోవిడ్ పాజిటివ్ కారణంగా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. ఇటీవ‌లే ఆయ‌న లండ‌న్ నుంచి తిరిగి వ‌చ్చారు. ఆయ‌న‌కు కోవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో టెస్టులు చేయించుకున్నారు. ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ అని డాక్ట‌ర్స్ నిర్దారించ‌డంతో ఆయ‌న వెంట‌నే చెన్నైలోని పోరూర్ స‌మీపంలోని రామ‌చంద్ర హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయ‌న డాక్ట‌ర్స్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నారు. ఇదే హాస్పిట‌ల్లో రీసెంట్‌గా క‌మ‌ల్ హాస‌న్ క‌రోనా కార‌ణంగానే జాయిన్ అయ్యారు. మ‌ళ్లీ పూర్తి ఆరోగ్యంతో తిరిగి వ‌చ్చారు. వ‌డివేలుకి క‌రోనా పాజిటివ్ అని, ఆయ‌న హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యార‌ని తెలియ‌డంతో ఆయ‌న అభిమానుల్లో టెన్ష‌న్ నెల‌కొంది. ఇటీవ‌ల వడివేలు త‌న త‌దుప‌రి చిత్రం నాయి శేఖ‌ర్ రిట‌ర్స్ సినిమా కోసం లొకేష‌న్స్ రీసెర్చ్‌లో భాగంగా డైరెక్ట‌ర్ సురాజ్‌, లైకా ఉమేష్‌ల‌తో క‌లిసి లండ‌న్ వెళ్లి లొకేష‌న్స్ చూసుకుని తిరిగి వ‌చ్చారు. వ‌డివేలు గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. త‌మిళంలో ఒకానొక ద‌శ‌లో స్టార్ క‌మెడియ‌న్‌గా హీరోల‌కు ఉన్నంత క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఎన్నిక‌ల్లో భాగమైన త‌ర్వాత ఆయ‌న‌కు అవకాశాలు త‌గ్గుతూ వ‌చ్చాయి. ఈ మ‌ధ్య ఆయ‌న మ‌ళ్లీ సినిమాలు చేస్తూ విజ‌యాల‌ను అందుకుంటూ వ‌స్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3JgHFtl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...