నాగ చైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం తన కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు కూడా ఓకే చేస్తూ వరుస సినిమాలతో బిజీగా అయ్యారు. ఈ క్రమంలోనే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు అంగీకరించారు. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ పాటలో సమంతకు సంబంధించిన ఓ లుక్ రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. ఇదే పోస్టర్‌ని సామ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ 'లెట్స్ రాక్' అని కామెంట్ పెట్టారు. సాధారణంగానే సుకుమార్ సినిమా అంటే ఐటెం పాట ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆయన చేసిన ప్రతి మూవీలో స్పెషల్ సాంగ్ కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకునే సుకుమార్.. ఈ సారి పుష్ప కోసం ఏకంగా సమంతను రంగంలోకి దించారు. సమంత క్రేజ్ క్యాచ్ చేసుకుంటూ సినిమాలో ఈ పాట మేజర్ అట్రాక్షన్ అయ్యేలా ఆయన స్కెచ్చేశారట. అల్లు అర్జున్- సమంత హుషారెత్తించే స్టెప్పులతో ఈ సాంగ్ థియేటర్లను హోరెత్తించనుందని అంటున్నారు. అయితే ఓ వైపు షూట్ చేస్తూనే మరోవైపు ఈ సాంగ్ ప్రమోషన్ చేపట్టిన సుక్కు.. తాజాగా రిలీజ్ చేశారు. 'సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్'ని చూసేందుకు సిద్ధంగా ఉండండి అని పేర్కొంటూ ఈ పోస్టర్ వదిలారు. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. సమంతను ఐటెం పాటలో చూసి ఎంజాయ్ చేయాలనే కుతూహలం జనాల్లో పెరిగిపోయింది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. రెండు భాగాలుగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగాన్ని 'పుష్ప ది రైజ్' పేరుతో డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3I7LdO0
v
No comments:
Post a Comment