Friday, 5 November 2021

Vishal: ఎనిమి ఫస్ట్ డే కలెక్షన్స్.. విశాల్, ఆర్య వైరం ఎంత రాబట్టిందంటే!!

యాక్షన్ హీరోగా తమిళ సినిమాలతో పాటు తెలుగు లోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న తాజాగా 'ఎనిమి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తెలుగులో 'నోటా' సినిమా చేసి మూడేళ్లు గ్యాప్ తీసుకున్న ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించారు. విశాల్‌తో పాటు మరో హీరో లీడ్ రోల్ పోషించారు. దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదలైన ఈ సినిమా తొలిరోజే డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు శత్రువులుగా ఎలా మారారు? ఆఖరికి వాళ్లు ఎలా కలుస్తారు? అనే కథను ఆసక్తికరంగా మలిచి ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు. విడుదలకు ముందే ఈ సినిమాపై అంచనాలు నెలకొనడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. తొలి రోజు ఏరియాల వారిగా కలెక్షన్ రిపోర్ట్ చూస్తే.. నైజాం 38 లక్షలు సీడెడ్ 16 లక్షలు ఉత్తరాంధ్ర 12 లక్షలు ఈస్ట్ గోదావరి 9 లక్షలు వెస్ట్ గోదావరి 6 లక్షలు గుంటూరు 12 లక్షలు కృష్ణా 5.4లక్షలు నెల్లూరు 5 లక్షలు మొత్తంగా చూస్తే రెండు రాష్ట్రాల్లో కలిపి కోటి రూపాయల 2 లక్షల షేర్, కోటి 60 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది ఎనిమి. ఇక తమిళనాడు రాష్ట్రంలో 2.55 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.15 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 2.1 కోట్ల గ్రాస్ రాబట్టి మొత్తం మీద వరల్డ్ వైడ్‌గా చూస్తే 7.4 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ వీకెండ్ సినిమాకు కలిసి రావొచ్చని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wjEn2i
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...