Friday, 5 November 2021

ఓ అమ్మాయితో కారులో బాలకృష్ణ.. మోహన్ బాబు బయటపెట్టిన సీక్రెట్! డేర్‌గా నటసింహం రియాక్షన్

రాజకీయాలు, సినిమాలే కాదు డిజిటల్ వేదికపై కూడా తన మార్క్ ఉంటుందని నిరూపించేలా రంగంలోకి దిగారు నందమూరి . ''అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవరు ఆపుతారో చూద్దాం'' అని గర్జిస్తూ నేరుగా ఆన్ లైన్ వేదికలపై అడుగు పెట్టారు బాలయ్య బాబు. ఆహా ఓటీటీపై '' అనే పేరుతో బాలయ్య టాక్ షో ప్రసారమవుతోంది. ఈ షో ఫస్ట్ గెస్ట్‌గా విచ్చేసి బాలయ్యతో మాటామంతీ జరిపారు. ఈ మేరకు బాలయ్య సీక్రెట్ ఒకటి బయటపెట్టారు మోహన్ బాబు. ఈ షోలో మోహన్ బాబు సీక్రెట్స్ బాలకృష్ణ రాబడతారని అంతా అనుకుంటే బాలయ్య సీక్రెట్స్ మోహన్ బాబు లాగే పయత్నం చేయడం విశేషం. ఇది చిట్ చాట్ షో అయినప్పటికీ చిన్నితెరపై ఈ ఇద్దరూ పోటాపోటీగా కనిపించారు. మోహన్ బాబు కెరీర్ సంగతులు, వ్యక్తిగత విషయాలు అన్నింటినిపై బాలయ్యబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక పనిలో పనిగా మోహన్ బాబు సైతం బాలయ్యను కొన్ని విషయాల్లో ప్రశ్నించారు. టీడీపీ పార్టీ గురించిన పలు విషయాలు అడగడమే గాక.. ఓ అమ్మాయితో కారులో బాలకృష్ణ చేసిన ప్రయాణాన్ని గురించి నేరుగా అడిగేశారు. మా ఇల్లు ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉండేది. అలా కారులో వెళ్తున్న సమయంలో నా ముందు కార్‌లో ఇద్దరు కనిపించారు. వెంటనే ఆ కారును ఓవర్‌టేక్ చేయమని డ్రైవర్‌తో చెప్పాను. అడ్డంగా వెళ్లి తీరా చూస్తే అందులో నువ్వు వేరే అమ్మాయి ఉన్నారు. అవునా? అని బాలయ్యను ఇరికించే ప్రశ్న వేశారు మోహన్ బాబు. దీంతో బాలయ్య బాబు ఓపెన్ అయ్యారు. ఆ అమ్మాయి పేరు అయితే చెప్పలేం కానీ ఆమె తన కుటుంబానికి సంబంధించిన అమ్మాయి అయితే కాదని డేర్‌గా ఒప్పుకున్నారు బాలకృష్ణ. అయితే తాను ప్రజా ప్రతినిధిని కాబట్టి ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చి తీసుకెళ్లి ఉండవచ్చు కదా అంటూ పాజిటివ్ ఆలోచనలు రేకెత్తించారు బాలయ్య. ఇలాంటి పసందైన ముచ్చట్లతో 'అన్‌స్టాప‌బుల్‌' షో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mMGA3h
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...