Friday, 5 November 2021

Upasana: మెగా కోడలితో సమంత.. బరువెక్కిన హృదయం!! దీపావళి వేళ అలాంటి మెసేజ్

నాగ చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత ఆ బాధ నుంచి బయటపడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది . దగ్గరి స్నేహితులతో సరదాగా విదేశాలు చుట్టి వస్తూ పలు పార్టీలు అటెండ్ అవుతోంది. ఎలాగోలా విడాకుల తాలూకు విషయాలను త్వరలోనే మరచిపోయి తిరిగి యాక్టివ్ కావాలని చూస్తున్న ఆమె.. తాజాగా హైదరాబాద్‌లోని తన ఇంట్లో దీపావళి పండగను సెలబ్రేట్ చేసుకుంది. ఈ సంబరాల్లో మెగా కోడలు కూడా కనిపించడం విశేషం. తన స్నేహితులు శిల్పా రెడ్డి, ఉపాసనలతో కలిసి దీపావళి వేడుకను ఎంజాయ్ చేసిన సమంత ఆయా ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంది. ఈ మేరకు ఎప్పటిలాగే కొన్ని మోటివేషనల్ లైన్స్ రాసింది. ఆనందాన్ని మించిన ధనం లేదని, మనశ్శాంతిని మించిన విజయం లేదని, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదని అలాగే దయా గుణాన్ని మించిన చల్లదనం లేదని సామ్ పేర్కొంది. అలాగే బరువెక్కిన హృదయంతో ఓ విషయం కూడా రివీల్ చేసింది సమంత. ''దీపావళి కాంతుల వెలుగులు విరజిమ్మలేదు. స్వీట్లలో ఉన్న రుచి కరువైంది. సంవత్సరం ఆరంభంలో ఏదన్నా బాధ కలిగితే ఆ తర్వాత వచ్చే పండుగలన్నీ చిన్నవే. నాకు తెలుసు అతిత్వరలో ఆ బాధ నుంచి బయటపడి సంతోషంగా ఉంటా అని. మీరు కూడా త్వరలో ఆనందం పొందుతారని ఆశిస్తున్నా'' అని సమంత పేర్కొంది. దీంతో ఈ సందేశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇకపై సినిమాల పరంగా దూసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్న సమంత వరుస ప్రాజెక్ట్స్ ఓకే చేస్తోంది. ఇప్పటికే తెలుగులో శాకుంతలం సినిమా కంప్లీట్ చేసి మరో రెండు సినిమాలను లైన్లో పెట్టిన సామ్, బాలీవుడ్‌లో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తోందట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wqZVKI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...