Friday, 5 November 2021

సూపర్ మచ్చి: చిరంజీవి చిన్నల్లుడి విశ్వరూపం.. రొమాంటిక్ సన్నివేశాలకు తోడు అవన్నీ..!

'విజేత' సినిమాతో హీరోగా పరిచయమైన చిరంజీవి చిన్నల్లుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఓ విలక్షణ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా రూపొందిన ‘’ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు ముస్తాబవుతోంది. దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్ నిర్మిస్తున్నారు. చిత్రంలో క‌ళ్యాణ్‌ దేవ్‌ సరసన ర‌చితా రామ్‌ హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుతున్న చిత్రయూనిట్.. మరోవైపు ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా దీపావళి కానుకగా 'సూపర్ మచ్చి' టీజర్ రిలీజ్ చేశారు. కెరీర్‌లో బిగ్ సక్సెస్ అందుకోవాలని బలంగా ఫిక్సయిన కళ్యాణ్ దేవ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని ఈ టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఒక నిమిషం 5 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్‌లో ఎలాంటి డైలాగ్స్ వినిపించకుండానే సినిమాపై ఆసక్తి రేకెత్తించడం విశేషం. హీరోయిన్ల మధ్య ప్రేమ, రొమాంటిక్ సన్నివేశాలకు తోడు కళ్యాణ్ దేవ్ యాక్షన్ సీన్స్ చూపించారు. ఇక టీజర్ చివర్లో కళ్యాణ్ దేవ్ డాన్స్ టాలెంట్ చూపించి తమ సినిమాతో అన్ని రకాల ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలిపారు దర్శకనిర్మాతలు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇకపోతే లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అందించిన బాణీల్లో చిత్రంలోని ఐదు పాటలు ఈ సినిమాకు మేజర్ అసెట్ కానున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, నరేష్‌లతో పాటు ప్రగతి, అజ‌య్‌, పోసాని కృష్ణమురళి, జబర్దస్త్ మహేష్, భద్రం, పృథ్వీ, ఫిష్ వెంకట్ కీలక పాత్రలు పోషించారు. నిజానికి 'సూపర్ మచ్చి' విడుదల కాస్త లేట్ అయినా పక్కాగా రంగంలోకి దిగుతున్నారని తెలుస్తోంది. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BSuEBb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...