Thursday, 4 November 2021

Shyam Singha Royలో ముగ్గురు భామల కథ ఇదే.. గుట్టు విప్పిన నాని

హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతోన్న సినిమా మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లు, టీజర్, సాంగ్ ప్రోమో ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్‌పై వెంకట బోయనపల్లి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాంటి ఈ సినిమాకు సంబంధించిన దీపావళి సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌తో పాటు సినిమాలోని స్టోరీని కాస్త లీక్ చేసేశాడు నాని. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటి వరకు సాయి పల్లవి, కృతి శెట్టిలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ దీపావళి సందర్భంగా మడోన్నా పాత్రకు సంబంధించిన లుక్కును రివీల్ చేశారు. దీంతో పాటు సాయి పల్లవి, కృతి శెట్టిల కొత్త పోస్టర్లను కూడా విడుదల చేశారు. దీంతో పాటు నాని ఓ పోస్ట్ కూడా చేశాడు. దాంట్లో ముగ్గురు కథానాయికల గురించి చెప్పేశాడు. మెమోరీ కృతి శెట్టి, టైం సాయి పల్లవి, ట్రూత్ అని చెప్పుకొచ్చాడు. అంటే ఈ ముగ్గురిలో ఒకరు ఫ్లాష్ బ్యాక్, ప్రజెంట్ అంటూ రాబోతోన్నట్టు కనిపిస్తోంది. పునర్జన్మల ఆధారంగా ఈ చిత్రం ఉంటుందనే టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్, ప్రతిభా వంతుడైన యశ్ మాస్టర్ ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫర్లుగా పని చేస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా.. తెలుగు తమిళ కన్నడ మళయాల భాషల్లో డిసెంబర్ 24న విడుదల కాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3k1FCyb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...