Friday, 26 November 2021

RRR సీక్రెట్స్ చెప్పిన రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ భయపెట్టేస్తారు! జక్కన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్

యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం . దర్శక ధీరుడు రూపొందిస్తున్న ఈ సినిమాను బడా నిర్మాత డీవీవీ దానయ్య భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. మెగా పవర్ స్టార్ , యంగ్ టైగర్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ ఇద్దరి లుక్స్, నాటు నాటు సాంగ్ మెగా, నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పించగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ వెల్లడిస్తూ ఇప్పటికే ఉన్న అంచనాలకు రెక్కలు కట్టారు రాజమౌళి. చిత్రంలోని 'జనని' రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో రాజమౌళి చేసిన కామెంట్స్ RRR మూవీపై ఉన్న ఆతృతను అమాంతం పెంచేశాయి. ఈ సినిమాలో హై థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయని, హీరో ఇంట్రడక్షన్స్, ఇంటర్వెల్ సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషనల్ సీక్వెన్సెస్, క్లైమాక్స్ సీన్స్ ఇలా అన్నింటిలో అంతర్లీనంగా ఓ ఎమోషన్ డ్రైవ్ చేస్తుంటుందని చెప్పి ఇరువురి అభిమానులను హూషారెత్తించారు జక్కన్న. సినిమా సోల్ మొత్తం ఆ ఎమోషనల్ లోనే దాగి ఉంటుందని అన్నారు. థియేటర్స్‌లో చూశాక ప్రేక్షకులు చాలా థ్రిల్ అవుతారని అన్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్‌, రామ్ చ‌ర‌ణ్‌ జంటగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ న‌టిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీంగా ఎన్టీఆర్‌ వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారు. శ్రీయ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ RRR (రౌద్రం రుధిరం ర‌ణం) సినిమాను జనవరి 7వ తేదీన భారీఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30Wi9Zh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...