Thursday, 25 November 2021

RRR ప్రమోషన్స్‌లో జక్కన్న సరికొత్త స్ట్రాటజీ.. 'జనని' సాంగ్ రిలీజ్‌కి ముందే అలా!!

సినిమా అంటేనే అదో కిక్కు. ఇక ఆయన చేసే ప్రమోషన్స్ మరో అట్రాక్షన్. తన సినిమా ప్రమోషన్స్ విషయంలో సరికొత్తగా ఆలోచించే జక్కన్న.. సినిమా విషయంలో వినూత్న స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. నాలుగేళ్లు షూటింగ్ దశలో ఉన్నా కూడా ముందునుంచి రెగ్యులర్‌గా RRR అప్‌డేట్స్ ఇస్తూ సినిమాపై హైప్ పెంచేస్తూ వచ్చారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్స్, టీజర్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోగా నవంబర్ 26న చిత్రంలోని 'జనని' లిరికల్ వీడియో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సాంగ్ విషయంలో కాస్త వినూత్నంగా ఆలోచించిన రాజమౌళి.. సినిమాకు ఎలాగైతే ముందు రోజు ప్రివ్యూ షోలు, బెనిఫిట్ షోలు వేస్తారో.. అలాగే 'జనని' పాటకు కూడా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఒకరోజు ముందే ఈ పాటను చూపించారు. ఈ సందర్భంగా RRR దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య మీడియాతో మాట్లాడుతూ రేపు సాయంత్రం ఈ విజువల్ ట్రీట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో అధికారికంగా విడుదల చేయబోతున్నట్లుగా తెలిపారు. కనిపించని ఎమోషన్స్‌తో కలగలిపిన సాంగ్ 'జనని' అని పేర్కొన్న రాజమౌళి.. ఈ సాంగ్ ఓ సాఫ్ట్ మెలోడీ అని, సోల్ ఆఫ్ ది హోల్ ఫిలిం అని చెప్పారు. ఈ సాంగ్ సినిమాకు మేజర్ అసెట్ అని అన్నారు. జనని పాటను మీ ముందుకు తెస్తున్నందుకు గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 'RRR సోల్ ఆంథెమ్' పేరుతో ఈ పాట మనందరి ముందుకు రానుంది. 1920 బ్యాక్ డ్రాప్‌లో పీరియాడికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో , హీరోలుగా నటిస్తుండగా.. ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీరవాణి బాణీలు కట్టిన ఈ సినిమాపై దేశవిదేశాల్లో ఉన్న ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. 2022 జనవరి 7న ఈ పాన్ ఇండియా మూవీ విడుదల కాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30XLd1S
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...