Thursday, 25 November 2021

విడాకుల తర్వాత అక్కినేని కాంపౌండ్‌లో సమంత! సైలెంట్‌గా కారు దిగి.. ఇంతకీ మ్యాటర్ ఏంటి?

ప్రేమలో మునిగితేలి పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్న అక్కినేని నాగ చైతన్య- జోడీ ఇటీవలే తమ వివాహ బంధానికి బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇకపై తాము భార్యాభర్తలుగా ఉండబోమని, కేవలం స్నేహితులుగా కొనసాగుతామంటూ ఇరువురు కూడా అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చి షాకిచ్చారు. దీంతో ఈ బ్రేకప్ వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఈ సెలబ్రిటీ జోడీ విడాకుల గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా చర్చించుకున్నారు. ఇకపోతే విడాకుల ప్రకటన అనంతరం అటు సమంత, ఇటు వేరు వేరు గృహాలకు షిఫ్ట్ అయి తమ తమ కెరీర్ కొనసాగిస్తున్నారు. అయితే ఇంతలో తాజాగా మరోసారి అక్కినేని కాంపౌండ్‌లో సమంత అడుగుపెట్టిందని తెలియడం జనాల్లో హాట్ టాపిక్ అయింది. అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోస్‌కి వెళ్లిందట సమంత. అయితే పర్సనల్‌గా కాకుండా ప్రొఫెషనల్‌గానే ఈ విజిట్ చేసిందని సమాచారం. కారులో నేరుగా అన్నపూర్ణ స్టూడియోస్‌కి చేరుకున్న సమంత.. ముఖంపై ముసుగుతో దిగి పని పూర్తి చేసుకొని వెళ్లిపోయిందట. ఇంతకీ సమంతకి అక్కడ ఏం పని అంటారా? ఇటీవలే 'శాకుంతలం' సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత.. ఈ సినిమా డబ్బింగ్ పనుల కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌కి రావలసి వచ్చిందట. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్నాయి. అయితే నాగ చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌కి సమంత రావడం ఇదే తొలిసారి కాబట్టి ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. మరోవైపు పర్సనల్ విషయాలు, ప్రొఫెషనల్ విషయాల్లో సమంత చూపిస్తున్న వేరియేషన్స్, దూసుకుపోతున్న తీరు పలువురి మన్ననలు పొందుతోంది. ప్రస్తుతం సమంత చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. అల్లు అర్జున్ 'పుష్ప' మూవీలో ఐటెం సాంగ్‌‌తో హుషారెత్తించబోతోంది. వీటితో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు కూడా సిద్దమవుతోందట సామ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DW51kX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...