Tuesday, 2 November 2021

RRR Glimpse : ఏ ఒక్క రికార్డూ బద్దలు కొట్టలేకపోయిన జక్కన్న!.. ఇంపాక్ట్ చూపించలేదా?

దర్శకధీరుడు వేసిన మంత్రం సరిగ్గా పని చేయలేదనిపిస్తోంది. అంటూ వదిలిన చిన్నపాటి టీజర్ అంతగా పని చేయలేదేమోననిపిస్తోంది. టాలీవుడ్ వరకు ఆ మ్యాజిక్ పని చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను చూసి అభిమానుల కడుపు నిండింది. కానీ పాన్ ఇండియన్ లెవెల్‌లో మాత్రం ఈ గ్లింప్స్ ఇంపాక్ట్ చూపించలేదనిపిస్తోంది. 40 సెకన్ల వీడియోతో రాజమౌళి ట్రెండ్ క్రియేట్ చేస్తాడని అంతా అనుకున్నారు. సోషల్ మీడియాలో రికార్డులన్నీ కొల్లగొట్టేస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ వకీల్ సాబ్, వలిమై సినిమాల విషయంలోనూ ఆర్ఆర్ఆర్ వెనకబడింది. ఇక మొన్నీ మధ్య విడుదల చేసిన రాధేశ్యామ్ కారెక్టర్ ఇంట్రో టీజర్‌ను కూడా దాట లేకపోయింది. 24 గంటల్లో ఆర్ఆర్ఆర్ కొల్లగొట్టిన వ్యూస్, లైక్స్ మరీ అంత గొప్పగా లేవు. ఇక కేజీయఫ్ చాప్టర్ 2 టీజర్‌కు అయితే దరి దాపుల్లో కూడా లేనట్టు కనిపిస్తోంది. రాధేశ్యామ్ 24 గంటల్లో 17 మిలియన్ల వ్యూస్, 991.4k లైక్స్ కొల్లగొట్టింది. అదే ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ 24 గంటల్లో 12.44మిలియన్ల వ్యూస్, 987.7k లైక్స్‌తో సరిపెట్టుకుంది. మోస్ట్ లైక్డ్ గ్లింప్స్‌లో వలిమై, భీమ్లా నాయక్ తరువాత ఆర్ఆర్ఆర్ మూడో స్థానంలో ఉంది. ఇది కేవలం ఒక్క యూట్యూబ్ చానెల్ లెక్కలు మాత్రమే. అలా మొత్తానికి ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ మాత్రం అంతగా ప్రభావం చూపెట్టలేకపోయిందనే తెలుస్తోంది. కానీ సౌత్ వరకు బాగానే ఆకట్టుకున్నట్టు కనిపిస్తోంది. జనవరి 7న ఈ చిత్రం రాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mzTP7g
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...