Tuesday, 2 November 2021

ఆచార్య మెలోడీ సర్‌ప్రైజ్ లోడింగ్.. ఎంటర్ కాబోతున్న రామ్ చరణ్- పూజా హెగ్డే జోడీ

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ఫినిష్ చేసిన కొరటాల.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. మరోవైపు చిత్ర ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇందులో భాగంగా ఈ సినిమా లోని మెలోడీ సర్‌ప్రైజ్ లోడింగ్ అంటూ అధికారిక ప్రకటన చేస్తూ రామ్ చరణ్- జోడీ ఫొటో షేర్ చేశారు. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన తొలి సాంగ్ 'లాహే లాహే' భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి, కాజల్, సంగీతలపై షూట్ చేసిన ఈ సాంగ్ రికార్డులు తిరగరాసింది. అయితే దానికి కొనసాగింపుగా ఇప్పుడు రామ్ చరణ్- పూజా హెగ్డే జోడీ ఎంటర్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఇద్దరిపై షూట్ చేసిన సెకండ్ సాంగ్ నవంబర్ 5వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. 'నీలాంబరి' అంటూ సాగిపోయే ఈ పాట మెలోడీ ప్రియుల హృదయాలను హత్తుకుంటుందనే హింట్ ఇచ్చారు. దేవాలయ భూముల స్కామ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో సిద్ద అనే పవర్ ఫుల్ రోల్ పోషించడమే గాక భారీ బడ్జెట్‌ కేటాయించి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చెర్రీ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా మణిశర్మ బాణీలు కడుతున్నారు. సందేశాత్మక కథకు మణిశర్మ బాణీలు తోడై ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. మెగా ఫ్యాన్స్ ఈ మూవీపై ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jYo32b
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...