Monday, 15 November 2021

Kajal Aggarwal: భ‌ర్త విష‌యంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ షాకింగ్ డిసిష‌న్‌.. !

హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్.. గ‌త ఏడాది త‌న స్నేహితుడు గౌత‌మ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత కూడా ఆమె ఆచార్య సినిమాలో న‌టించింది. దీంతో పెళ్లి త‌ర్వాత కూడా సినిమాల్లో న‌టించ‌డానికి తాను సిద్ధ‌మేన‌ని కాజ‌ల్ అగ‌ర్వాల్ చెప్ప‌కనే చెప్పేసింది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో ఆమె సినిమాలను వ‌దులుకుంటుంది. ఇప్ప‌టికే నాగార్జున ఘోస్ట్ సినిమా నుంచి బ‌య‌ట‌కు కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. రీసెంట్‌గా ఇండియన్ 2 నుంచి కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింద‌ని టాక్ వినిపిస్తోంది. కాగా లేటెస్ట్‌గా కాజ‌ల్‌కు సంబంధించిన వార్తొక‌టి నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అదేంటంటే.. కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లుని ఇండ‌స్ట్రీకి తీసుకొస్తుంద‌ట‌. గౌత‌మ్ కిచ్లుని లుక్ ప‌రంగా చూడ‌టానికి చ‌క్క‌గా ఉంటాడు. పెళ్లైన కొత్త‌లో గౌత‌మ్ కిచ్లుతో క‌లిసి కాజ‌ల్ అగ‌ర్వాల్ ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌లో న‌టించిన సంగతి తెలిసిందే. ఎలాగూ ఇండ‌స్ట్రీ ఎలా ఉంటుంది? లోటు పాట్లేంటి? అనే విష‌యాలు కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు బాగానే తెలుసు. ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది కాబ‌ట్టి మంచి ప‌రిచ‌యాలు కూడా ఉన్నాయి. దాన్ని ఉప‌యోగించుకుని గౌత‌మ్ కిచ్లుని ఇండ‌స్ట్రీకి తీసుకొస్తే బావుంటుంద‌ని కాజ‌ల్ ఆలోచ‌న‌గా ఉండొచ్చునేమోనని అనుకుంటున్నారు. ఇందులో నిజా నిజాలేంటి? అనేది తెలియ‌డం లేదు. మ‌రి అబ‌ద్ద‌మైతే, కాజ‌ల్‌కు ఈ విష‌యం తెలిస్తే ఆమె ఏమైనా రియాక్ట్ అవుతుందేమో చూడాలి. ఒక‌వేల నిజ‌మైతే మాత్రం ఎంత వ‌ర‌కు కాజ‌ల్ అగ‌ర్వాల్ ఆలోచ‌న స‌క్సెస్ అవుతుందో కూడా చూడాలి. ప‌దిహేనేళ్ల‌కు పైగానే ద‌క్షిణాదిన తెలుగు, త‌మిళ చిత్రాల‌తో పాటు అడ‌పా ద‌డ‌పా బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి త‌న‌దైన గుర్తింపు సంపాదించుకుంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. అంతే కాదండోయ్ డిజిట‌ల్ రంగంలోకి కూడా అడుగు పెట్టింది. పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కిచ్లుని బిజినెస్ వ్య‌వ‌హారాల్లోనూ ఆమె తోడుగా నిలుస్తోంది. ప్ర‌స్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి ఆచార్య సినిమాలో ఆయ‌న‌కు జోడీగా న‌టించింది. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల‌వుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Hooe0J
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...