ప్రభాస్ సినిమా నుంచి వచ్చిన పాట ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంది. అలాంటి పాట ఈ మధ్య కాలంలో రాలేదని శ్రోతలు పదే పదే వింటూనే ఉన్నారు. పాటలోని లిరిక్స్, ట్యూన్, గాయనీగాయకుల గాత్రం ఇలా ప్రతీ ఒక్కటీ అందరినీ ఆకట్టుకుంది. ఇక లిరికల్ వీడియోలోని కాన్సెప్ట్ అయితే అందరినీ మెప్పించింది. అలా ఒక్క పాటతో అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చేశారు. ఆ రోజు పాటను విడుదల చేస్తామని అభిమానులతో పదే పదే వెయిట్ చేయించారు. సాయంత్రం ఐదు గంటలకు రావాల్సిన పాట చివరకు తొమ్మిది గంటలకు రిలీజ్ అయింది. ‘నేను మీ గీత రచయిత కృష్ణకాంత్.. ఎక్కడ విన్నా ఇప్పుడు ఈ పాటే వినిపిస్తోంది. ఈ పాటను జస్టిన్ గారు ట్యూన్ ఇచ్చారు. యువన్ శంకర్ రాజా, హరిణ పాడారు. ఇది ఒక క్లిష్టమైన సందర్భంలో వచ్చే పాట. అందుకే ఏదీ కూడా పూర్తిగా రివీల్ చేయలేదు. ఇది 70వ దశకంలో యూరోప్‌లో జరిగే ప్రేమ కథ. అందుకే ఇంగ్లీష్ పదాలు ఎక్కడా వాడకుండా కొంచెం పొయెట్రీ రాశాం.. ఇప్పటి ఆడియెన్స్‌కు ఇది ఎక్కుతుందా? అర్థమవుతుందా? అని అనుకున్నాం. కానీ ఒక్కసారి పాట విడుదలయ్యాక.. లిరికల్ వీడియోగ్రాఫిక్స్ చూసి జనాలందరికీ నచ్చింది. అయితే మొదటి సారి వింటే అర్థం కావడం లేదు.. స్లో పాయిజన్‌లా ఎక్కేస్తోంది అని అంటున్నారు. లూప్ మోడ్‌లో పెట్టి వింటున్నామని చెబుతుంటే ఆనందంగా ఉంద’ని లిరిసిస్ట్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కానీ ఆ ఆనందంలో 70వ దశకంలో జరిగే ప్రేమ కథ అని గుట్టు విప్పేశాడు. అందుకే ఇండియాలోని ఎమర్జెన్సీకి సంబంధించిన విషయాన్ని కూడా ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో చూపించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oMGMiP
v
No comments:
Post a Comment