Thursday, 25 November 2021

యూఎస్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న లైగర్.. రిలీజ్‌పై పూరి జగన్నాథ్ ఫైనల్ డిసీజన్!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్- రౌడీ స్టార్ కాంబోలో రాబోతున్న సినిమా ''. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్ లైన్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. గత ఏడాదికి పైగా ఈ సినిమా షూటింగ్ చేస్తున్న పూరి.. ఇప్పుడు మరో షెడ్యూల్ ఫినిష్ చేసి రిలీజ్ డేట్ కోసం వెతుకులాట షురూ చేశారట. లైగర్ సినిమాలోని ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ కోసం రీసెంట్‌గా యూఎస్ వెళ్లిన చిత్రబృందం తాజాగా ఆ షెడ్యూల్ అంతా కంప్లీట్ చేశారని సమాచారం. ఈ షెడ్యూల్‌లో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ - హీరో విజయ్ దేవరకొండలపై ఫైట్ సీక్వెన్స్, కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని తెలుస్తోంది. చిత్ర సన్నివేశాలు రియాలిటీకి దగ్గరగా ఉండేలా శ్రద్ద తీసుకున్న డైరెక్టర్ అవుట్‌పుట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదట. ప్రతి సీన్ కోసం చిత్ర బృందాన్ని ఎంతో కష్టపెట్టి కావాల్సిన అవుట్‌పుట్ రాబట్టారని టాక్. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్‌లు దర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ బాక్సింగ్‌లో‌ శిక్షణ కూడా తీసుకున్నారు. ఇంతవరకు ఓకే గానీ చిత్ర విడుదల విషయంలో ఆలస్యం అవుతుండటంతో పూరి ఓ నిర్ణయానికి వచ్చేశారని తెలుస్తోంది. 2022 ప్రారంభంలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఆయన ఫిక్సయ్యారట. అతిత్వరలో విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారని అంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FLj2T6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...