Friday, 26 November 2021

నాగ చైతన్య లవ్ ఎఫైర్.. స్టార్ హీరో కూతురితో చెట్టాపట్టాల్! సమంతను పెళ్లాడకముందు ఇంత జరిగిందా..?

అదేంటో.. మీడియాలో వచ్చే కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అవి నిజమా? లేక గాసిప్సేనా అనేది పక్కనబెడితే జనాల్లో పలు చర్చలకు తెరలేపుతుంటాయి. తాజాగా అక్కినేని వారసుడు, యువ హీరో గురించి కూడా అలాంటి ఓ న్యూస్ బయటకు రావడంతో జనం చెవులు కొరుక్కుంటున్నారు. సమంతతో పెళ్లికి ముందే నాగ చైతన్యకు మరో లవ్ ఎఫైర్ ఉందనేది మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం. ఇంకేముంది జనాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అయింది. రీసెంట్‌గా సమంత- నాగ చైతన్య డివోర్స్ తీసుకుంటున్నట్లు ప్రకటించాక వీరిద్దరికి సంబంధించిన ప్రతి వార్త జనాల్లో ఓ ఇష్యూ అవుతోంది. ఈ నేపథ్యంలోనే పెళ్లికి ముందు అనేది అందరి దృష్టిని లాగేసింది. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సమంతను పెళ్లి చేసుకోకముందే కమల్ హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌ని ప్రేమించాడట చైతూ. అంతేకాదు శృతి హాసన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిన నాగ చైతన్య ఆమెతో డేటింగ్ కూడా చేసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారని, అయితే ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ వారి ప్రేమ పెళ్లి పీటలు ఎక్కలేదనేది మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారాల సారాంశం. దీంతో ఈ ఇష్యూ వైరల్ అయింది. 2017 సంవత్సరంలో శృతి- నాగ చైతన్య మధ్య సీరియస్ రిలేషన్ నడిచిందని టాక్. వీరద్దరూ కలిసి 'ప్రేమమ్‌' సినిమాలో నటించారు. 2018లో ఈ మూవీ విడుదలైంది. మరి అదే 2017 సంవత్సరంలో సమంతతో పెళ్లి జరిగింది. పైగా అంతకుముందు చై- సామ్ కొన్నేళ్లపాటు ప్రేమించుకున్నారు కూడా. సో.. ఇప్పుడొస్తున్న శృతి- నాగ చైతన్య లవ్ ఎంతవరకు నిజం అనేది జనాల్లో డిస్కషన్ పాయింట్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30UUDMh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...