Wednesday, 17 November 2021

‘శ్యామ్ సింగరాయ్’ టీజర్ రివ్యూ.. మహిళల కోసం దేవుడుని కూడా ఎదిరించే మొనగాడు

అడిగే అండ‌లేదు..క‌ల‌బ‌డే కండ‌లేదుర‌క్షించాల్సిన దేవుడే రాక్ష‌సుడిగా మారుతుంటే..కాగితం క‌డుపు చీల్చుకుపుట్టి.. రాయ‌డ‌మే కాదు.. కాల‌రాయడం కూడా తెలుస‌ని అక్ష‌రం ప‌ట్టుకున్న ఆయుధం పేరే ‘శ్యామ్ సింగ‌రాయ్‌’ అసలు ఎవ‌రు? ఓ రైట‌ర్‌.. ఎలా ఎదురుతిరిగాడు.. ప్ర‌జ‌ల్లో ఎలా చైత‌న్యం తీసుకొచ్చాడ‌నేది తెలియాలంటే శ్యామ్ సింగ‌రాయ్ సినిమా చూడాల్సిందేన‌ని అంటున్నారు మేక‌ర్స్‌. గురువారం నేచుర‌ల్ స్టార్ హీరోగా న‌టిస్తోన్న ‘శ్యామ్ సింగ‌రాయ్‌’ టీజ‌ర్ విడుద‌లైంది. https://twitter.com/NameisNani/status/1461189856625782786?s=20 బెంగాల్‌లో కొంద‌రు అమ్మాయిల‌పై అత్యాచారాలు చేస్తుంటారు. వారికి ఎవ‌రూ అడ్డు చెప్ప‌లేరు. చివ‌ర‌కు ఆ దేవుడు కూడా. అలాంటి స‌మ‌యంలో వారికి అండ‌గా నిల‌బ‌డుతూ ఒక వైపు అక్ష‌రంతో వారిలో చైత‌న్యాన్ని నింపుతూనే.. వారికి గుండెకు ధైర్యాన్నిచ్చే వాడే శ్యామ్ సింగ‌రాయ్ అని టీజ‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. పెద్ద గుడి, చిన్న బోట్లు కాలిపోవ‌డం.. మ‌హిళ‌ల‌పై కొంద‌రు దాడుల చేయ‌డం అన్నీ ఈ టీజ‌ర్‌లో చూడొచ్చు. అలాగే టైటిల్ పాత్ర‌లోని నాని ఈ టీజ‌ర్ అదిరిపోయే హీరోయిజాన్ని చూపించిన‌ట్లు తెలుస్తుంది. అలాగే చివ‌ర‌ల్లో ఆ మ‌హిళ‌లు ఎవ‌రికీ బానిస‌లు కారు.. చివ‌ర‌కు ఆ దేవుడుకి కూడా అంటూ బెంగాళీలో నాని డైలాగ్ చెప్ప‌డం కొస‌మెరుపు. నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతోన్న బారీ చిత్రం ‘శ్యామ్ సింగ‌రాయ్‌’. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 24న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. తొలిసారి నాని తెలుగుతో పాటు శ్యామ్ సింగ‌రాయ్‌ను మిగిలిన ద‌క్షిణాది భాష‌లైన త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ఒకేసారి విడుద‌ల చేస్తుండం విశేషం. నాని ఇందులో రెండు వేరియేష‌న్స్ ఉన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. అలాగే ఇందులో సాయిప‌ల్ల‌వి, కృతిశెట్టి, మ‌డొన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. కాగా..సాయిప‌ల్ల‌వి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో కోల్ కతాలోని శ్యామ్ సింగ‌రాయ్ జోడీగా న‌టిస్తే, కృతిశెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ ప్రెజంట్ నానితో జోడీ క‌నిపించ‌నున్నారు. ఇటీవ‌ల నాని శ్యామ్ సింగ‌రాయ్ లుక్‌, ‘రైజ్ ఆప్ శ్యామ్ సింగ‌రాయ్’ అనే లిరిక‌ల్ సాంగ్‌కు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో నాని కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న చిత్ర‌మిది.నిహారిక ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట బోయ‌న‌ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జె.మేయ‌ర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం నాని అంటే సుందరానికీ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అలాగే దసరా అనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qOIzGz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...