Friday, 19 November 2021

నేను ఈ రోజు వాటిని ధరించలేదు!.. వామ్మో శ్రుతీ హాసన్ మామూల్ది కాదు

తన ప్రియుడు శంతను హజారికతో చేసే రచ్చకు నెట్టిళ్లు మొత్తం షాక్ అవుతుంటుంది. బయటున్నా, ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా సరే శ్రుతీ హాసన్, శంతను మాత్రం వారి బిజీలో వారుంటారు. సెల్ఫీలు, ముద్దులంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంటారు. వీరిద్దరు బయట కనిపిస్తే చాలు కెమెరాకళ్లన్నీ అటువైపే తిరుగుతుంటాయి. ముంబైలో ఉంటున్న వీరిద్దరూ సోషల్ మీడియాలో మాత్రం ట్రెండ్‌లో ఉంటారు. తాజాగా శ్రుతీ హాసన్ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఇందులో అనేక ప్రశ్నలకు శ్రుతీ హాసన్ సమాధానం ఇచ్చింది మీకు షాపింగ్ చేయడం, ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ కొనడం ఇష్టమా? అని ఓ నెటిజన్ అడిగాడు. అవును నాకు షాపింగ్ చేయడం ఇష్టం.. నేనే సమయం దొరికినప్పుడు గ్రాసరీస్ కొంటాను.. నేను కొనడమే నాకు ఇష్టం.. వాటిని తీసుకొచ్చి నేను వండుతాను.. నాకు అది ఇష్టం అని శ్రుతీ హాసన్ తెలిపింది. టాటూల గురించి అడగ్గా.. తన ఒంటి మీదున్న వాటిని చూపించేసింది ఇక ఈ మధ్య షూటింగ్‌లో గాయమైంది.. కదా? అది ఎలా ఉంది తగ్గిందా? అని ఇంకో నెటిజన్ అడిగాడు. పాతది కాస్త తగ్గింది..మళ్లీ ఇంకోటి కొత్తగా అయిందంటూ శ్రుతీ హాసన్ వాటిని చూపించింది. అయితే మామూలుగా మీకు బ్లాక్ అంటే ఇష్టం కదా? ఈ రోజేంటి మరి ఇలా వైట్ డ్రెస్సులో ఉన్నారు అని ఓ నెటిజిన్ అడిగాడు. అవును నేను ఈ రోజు బ్లాక్ కలర్ దుస్తులు ధరించలేదు.. నాకు ఆ కలర్ అంటేనే ఇష్టం. కానీ నాకు వైట్ అంటే నచ్చదు..మరి ఈరోజు ఇది ఎందుకు వేసుకున్నానో నాకు కూడా అర్థం కాలేదు అని చెప్పుకొచ్చింది. శ్రుతీ హాసన్ ప్రస్తుతం ప్రభాస్ సలార్, బాలయ్య గోపీచంద్ NBK 107లో హీరోయిన్‌గా నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/325iiJR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...