Saturday, 20 November 2021

చిరంజీవితో నటించేందుకు నయనతార డిమాండ్.. హాట్ టాపిక్‌గా మారిన రెమ్మ్యూనరేషన్ మ్యాటర్

'సైరా నరసింహా రెడ్డి' సినిమా తర్వాత మెగాస్టార్‌ చిరంజీవితో మరోసారి తెరపంచుకోనుంది సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార. పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న మెగాస్టార్ లేటెస్ట్ మూవీ ‘’లో ఆమెను కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. ఈ మేరకు రీసెంట్‌గా అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా రెమ్మ్యూనరేషన్ గురించిన ఓ సమాచారం వైరల్ అవుతోంది. మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన ‘లూసిఫర్‌’ సినిమాను తెలుగులో ‘గాడ్‌ ఫాదర్‌’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. మోహన్‌ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం సహా భారీ తారాగణం ఎంచుకున్నారు. అయితే ఈ సినిమాలో ఎంతో కీలకంగా ఉండే హీరో సోదరి పాత్ర కోసం నయన్‌ని తీసుకోగా.. ఈ రోల్ చేయడానికి ఆమె భారీగా డిమాండ్ చేసిందట. ఏకంగా రూ.4 కోట్లు డిమాండ్ చేయడంతో నిర్మాతలు కూడా ఓకే చెప్పేశారట. సినిమాలో ఈ రోల్‌ ఎంతో కీలకంగా ఉండనుందని, అందుకే ఆమె ఎంత డిమాండ్ చేసినా ఓకే చెప్పారని టాక్. కొణిదెల ప్రొడెక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్‌ కీ రోల్‌ పోషిస్తున్నట్లు సమాచారం. నయనతార భర్తగా ఆయన నటిస్తున్నారని సమాచారం. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ కూడా ఇందులో భాగం కాబోతున్నారని అంటున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్‌ బాణీలు కడుతుండగా.. నీరవ్‌ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3HGJpv0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...