అదేంటో ఈ మధ్యకాలంలో ఇద్దరు బడా స్టార్స్ కలవడం, అభిమానులకు పూనకాలు తెప్పించడం తరచుగా జరుగుతోంది. దీనికి మల్టీస్టారర్ సినిమాల హవా పెరగడం ఓ కారణం అయితే, బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రోగ్రామ్స్ మరో కారణం అవుతున్నాయి. ఇదికాస్త స్టార్ హీరోల అభిమానుల నడుమ స్నేహపూర్వక వాతావరణం తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 'ఎన్టీఆర్‌తో ' అనే ప్రకటన రావడం ఇరువురి అభిమానులను హుషారెత్తించింది. సూపర్ స్టార్, యంగ్ టైగర్ ఇద్దరూ ఒకే తెరపై సందడి చేయబోతున్నారు. స్టార్ హీరోల సరదా మాటలకు '' వేదిక కాబోతోంది. వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న రియాల్టీ గేమ్ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. సాధారణ ప్రజల ఆత్మస్థైర్యాన్ని పెంపెందించడమే గాక కాసులు కురిపిస్తున్న ఈ షోలో అప్పుడప్పుడు సెలబ్రిటీలను తీసుకొచ్చి సందడి చేస్తున్నారు. రీసెంట్‌గా సమంతను హాట్ సీటులో కూర్చోబెట్టి ప్రశ్నలు సంధించిన ఎన్టీఆర్.. ఇప్పుడు మహేష్ బాబును సీన్ లోకి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ త్వరలోనే టీవీలో ప్రసారం కానుంది. ఈ మేరకు జెమినీ టీవీ యాజమాన్యం అధికారిక ప్రకటన జారీ చేసింది. ఈ న్యూస్ తెలిసి అటు ఎన్టీఆర్, ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు. ఈ ఇద్దరి కలయికను చూడాలని ఆతృత చెందుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్, మహేష్ బాబు ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు 'సర్కారు వారి పాట' మూవీ చేస్తుండగా.. ఎన్టీఆర్ RRR సినిమా పనుల్లో ఉన్నారు. ఈ రెండు సినిమాల కోసం టాలీవుడ్ ప్రేక్షకలోకం ఆతృతగా ఎదురుచూస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3x3gEnD
v
No comments:
Post a Comment