ఇటీవల యాక్సిడెంట్ కారణంగా హాస్పిటల్‌లో జాయిన్ అయిన మెగా మేనల్లుడు.. సాయి ధరమ్ తేజ్ పూర్తి ఆరోగ్యంతో కోలుకుని తన మావయ్యలు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌లతో కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా మెగా హీరోలందరూ ఈ దీపావళికి ఒకచోట చేరారు. మెగాస్టార్ చిరంజీవి ఈ దీపావళి తమకెంతో ప్రత్యేకమైన పండుగ అని చెప్పారు. అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి పూర్తిగా కోలుకున్నాడు. మా కుటుంబ సభ్యులందరికి ఇది నిజమైన పండుగ అని తెలిపారు. తాజాగా చిరంజీవి ట్వీట్ చేసిన ఈ పోస్ట్ రీ- ట్వీట్ చేస్తూ ''నా పునర్జన్మకి కారణమైన మీ ప్రేమకి మీ ప్రార్ధనలకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను. మీ ప్రేమ పొందడం నా పూర్వజన్మ సుకృతం'' అని పేర్కొన్నారు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారని తెలిసి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. గత వినాయక చవితి రోజున బైక్‌పై వెళుతుండగా.. ప్రమాదవశాత్తు హైదరాబాద్ లోని ఐకియా సమీపంలో బైక్ యాక్సిడెంట్‌కు గురయ్యారు సాయి ధరమ్ తేజ్. ఆ తర్వాత రెండు నెలలకు పైగా హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. దసరా రోజున సాయి ధరమ్ తేజ్ తన పుట్టినరోజున డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా దీపావళి సందర్భంగా తన ఫ్యామిలీకి సంబందించిన హీరోలతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kuIAvJ
v
No comments:
Post a Comment