Monday, 8 November 2021

అనసూయతో హైపర్ ఆది రొమాంటిక్ మూమెంట్.. మనోడికి దిమ్మతిరిగినట్లుంది! నా ఫీలింగ్స్ అంటూ ఓపెన్‌

కెమెరా ముందుకొస్తే చాలు పంచులతో పరేషాన్ చేయడం నైజం. మాటమాటకు తూటా లాంటి పంచ్ వేస్తూ కడుపుబ్బా నవ్వించే ఆది.. పక్కన అమ్మాయి ఉంటే మరింత రెచ్చిపోతుంటారు. ఇప్పటికే అలా చాలా స్కిట్స్ చేసి రొమాంటిక్ డోస్ దట్టించిన ఆయన, హాట్ యాంకర్ అనసూయతో చేసే హంగామా అయితే అంతాఇంతా కాదు. జబర్దస్త్ జోడీల్లో యాంకర్ అనసూయ- హైపర్ ఆది జోడీకి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఈ ఇద్దరూ కలిశారంటే ఆ రొమాంటిక్ డోస్ మాటల్లో చెప్పలేం. ఎన్నో ప్రోగ్రామ్స్‌లో అనసూయతో కలిసి రొమాంటిక్ డాన్సులేస్తూ బుల్లితెరను షేక్ చేసిన హైపర్ ఆది.. ఇప్పుడు అదే అనసూయతో రొమాంటిక్ మూమెంట్ ఎంజాయ్ చేశాడు. నవంబర్ 11న ప్రసారం కాబోతున్న రిలీజ్ చేయగా అందులో హైపర్ ఆది- జోడీ ఇచ్చిన రొమాంటిక్ ట్రీట్ వైరల్ అవుతోంది. ఆమెతో చెట్టాపట్టాలేసి డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయాడు ఈ జబర్దస్త్ కమెడియన్. ప్రియతమా అంటూ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాలోని సూపర్ హిట్ పాటతో ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది- అనసూయ జోడీ తెగ రెచ్చిపోయింది. ఎవరికివారు రొమాంటిక్ ముచ్చట్లతో మత్తెక్కించారు. 'ఆది.. మనం డ్యాన్స్ చేస్తుంటే బ్లాస్ట్ చేశారు. నీకు ఎలా అనిపించింది?' అని అనసూయ అడగ్గానే.. నువ్వు ఇలా చేయి పట్టుకోవాలే కానీ నా కింద బాంబు పెట్టినా బాగుంటుంది అంటూ హాట్ పంచ్ విసిరాడు హైపర్ ఆది. చల్లటి గాలిలో గట్టిగా హగ్ ఇచ్చి, ఓ ముద్దు.. మా ఆయన భరద్వాజ్ పెడితే ఎంత బాగుంటుందో అంటూ హైపర్ ఆదిని ఊరించి ఉసూరుమనిపించింది అనసూయ. దీంతో హైపర్ ఆది తన లోని పంచ్ మహారాజును బయటకు తీసి కామెంట్ చేశాడు. ఇకపోతే జబర్దస్త్ టీంలో హైపర్ ఆది చాలా స్పెషల్ అని, అలాంటి పంచులు రాయడం మామూలు విషయం కాదని గతంలో చాలాసార్లు ఓపెన్ అయింది అనసూయ. అందుకే ప్రతి ఒక్కరికీ హైపర్ ఆది స్పెషల్ అని ఆమె చెప్పింది. అయితే గతంలోలా కాకుండా ఈ మధ్యకాలంలో హైపర్ ఆది- అనసూయ ఇద్దరూ కలిసి చాలా అరుదుగా ఇలాంటి రొమాంటిక్ ట్రీట్ ఇస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BREHXj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...