యాంకర్, నటి పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? పెళ్లి పెద్ద కోసం వెతుక్కుంటుందా? అంటే అవుననక తప్పదు. ఎందుకో తెలుసా!.. రీసెంట్‌గా విడుదలైన ఓ ప్రోమో అలాగే ఉంది. అసలు ఇంతకీ ఈ ప్రోమోలో ఏముందనే విషయంలోకి వెళితే, యాంకర్ సర్కార్ అనే ఓ గేమ్ షోను హోస్ట్ చేస్తున్నారు. ఇందులో సీనియర్ కమెడియన్ అలీతో పాటు ప్రవీణ్, మధు సహా యాంకర్ శ్రీముఖి కూడా పాల్గొంది. గేమ్ షోలోకి ఎంటర్ అయిన తర్వాత శ్రీముఖి మాట్లాడుతూ తగ్గేదే లే అని డైలాగ్ వేయగా.. ప్రదీప్, ఆమె శరీరాకృతిని బేస్ చేసుకుని తగ్గేదే లే అంటూ కామెంట్ చేశాడు. ఇక గేమ్ షోలో అందరూ పాల్గొన్నారు. ఇందులో యాంకర్ ప్రదీప్ వేసిన ప్రశ్నకు జవాబు తెలిసిన వారి వారి సమాధానాన్ని వేలం పాట పాడుకుంటారు. ఇదంతా ప్రోమోలో కనిపిస్తుంది. అదే కమ్రంలో యాంకర్ శ్రీముఖి అలీతో మాట్లాడుతూ.. సార్! మీరే దగ్గరుండి నా పెళ్లి చేయాలి అంటూ అడిగింది. శ్రీముఖి అలా అనగానే, షాకయ్యాడు. యాంకర్ ప్రదీప్..తప్పకుండా నీ పెళ్లి అవుతుంది ఏదో ఒకరోజు అవుతుంది శ్రీముఖి అని కామెంట్ చేయగా, నీకు కూడా పెళ్లవుతుందిలే ప్రదీప్ అని శ్రీముఖి కౌంటర్ ఇచ్చింది. దానికి ప్రదీప్ నాకొద్దులేమ్మా! అని శ్రీముఖికి దండం పెట్టేశాడు. ఇక అలీ, ప్రవీణ్, మధు, శ్రీముఖి వేలం పాటలో పాల్గొన్నారు. ఈ గేమ్‌లో మధు లేదా శ్రీముఖియే గెలుస్తారని అలీ అంటే ఎందుకన్నా అని ప్రవీణ్ క్వశ్చన్ చేయగా.. మధు సాఫ్ట్ వేర్, శ్రీముఖి హార్డ్‌వేర్ కాబట్టి గెలుస్తారు. నువ్వు నేను(ప్రవీణ్‌ను ఉద్దేశించి అలీ) టప్పర్ వేర్స్ కాబట్టి గెలవం అన్నాడు. ఇక ప్రదీప్ వేసిన ఓ ప్రశ్నకు సమాధానం తెలిసిన అలీ, మధు, శ్రీముఖి, ప్రవీణ్ సమాధానం కోసం వేలం వేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ.. ప్రవీణ్‌కి కోపమొచ్చి గేమ్ నుంచి మధ్యలోనే వెళ్లిపోయాడు. గేమ్ షోలో ప్రశ్నకు సమాధానం చెప్పడం వేరు. సమాధానం తెలిసిన ప్రశ్నకు సమాధానాన్ని వేలం పాటలో గెలుచుకోవడం అనేది సర్కార్ అనే గేమ్ షోలో సాగే కొత్త పద్ధతి. ఆహాలో మాధ్యమంలో ఈ గేమ్ షో నవంబర్ 11న ప్రసారం కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qlWGD3
v
No comments:
Post a Comment