Saturday, 6 November 2021

బన్నీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఏకంగా అల్లు అరవింద్ రంగంలోకి దిగినా ఫలితం శూన్యం.. అంతా అయోమయం!

అభిమానులు కాస్త నిరాశ చెందే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన కెరీర్‌లో తొలి పాన్ ఇండియా మూవీగా రాబోతున్న '' విషయమై చక్కర్లు కొడుతున్న ఓ వార్త బన్నీ ఫ్యాన్స్‌ని బాధ పెడుతోంది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తామని చిత్ర బృందం గతంలోనే ప్రకటించగా.. ఇప్పుడు హిందీ రైట్స్ విషయంలో చిక్కుపడిందట. ‘పుష్ప’ మూవీని హిందీలో విడుదల చేసేందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయమై చిత్ర నిర్మాతలు అక్కడి పంపిణీదారులతో చర్చలు జరుపుతున్నా ప్రయోజనం లేదని తెలుస్తోంది. చివరకు స్వయంగా అల్లు అరవింద్‌ కూడా రంగంలోకి దిగి చర్చలు జరిపినా ఎలాంటి పాజిటివ్ యాక్షన్స్ కనిపించడం లేదట. దీంతో చిత్రయూనిట్ అయోమయంలో పడిందని సమాచారం. ఈ విషయం బయటకురావడంతో జనాల్లో హాట్ టాపిక్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రెండు భాగాలుగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా తొలి భాగం ‘పుష్ప ది రైజ్‌’ను డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేకర్స్. చిత్తూరు జిల్లాలోని శేషాచ‌ల అడవుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. మ‌ల‌యాళ స్టార్ ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సినిమా అప్‌డేట్స్ బన్నీ అభిమానుల్లో ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకలోకం ఈగర్‌గా వెయిట్ చేస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kcnnpW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...