Sunday, 7 November 2021

డైరెక్టర్ అవి పంపించాడట!.. బ్రహ్మాజికి చెప్పిన ప్రియాంక జవాల్కర్

తిమ్మరుసు సినిమాతో బ్రహ్మాజీ, , మధ్య మంచి ర్యాపో ఏర్పడింది. సెట్‌లో ఈ ముగ్గురు ఫుల్ హల్చల్ చేశారు. నెట్టింట్లో ఈ ముగ్గురూ కలిసి చేసే సందడి మామూలుగా ఉండదు. ఎప్పుడూ కూడా మీద కౌంటర్లు వేసేందుకు ప్రయత్నిస్తుంటుంది ప్రియాంక. అయితే ప్రియాంక మీద బ్రహ్మాజీ వేసే సెటైర్లు తెగ వైరల్ అవుతుంటాయి. బ్రహ్మాజీ ఏజ్ మీద ప్రియాంక కౌంటర్లు వేస్తుంటుంది. తాజాగా తిమ్మరుసు డైరక్టర్ ప్రియాంకకు అల్పాహారాన్ని పంపించాడట. శరణ్ కొప్పిశెట్టి లాంటి ఫ్రెండ్స్ ఉంటే ఇలాంటి ఉపయోగాలుంటాయి.. అలాంటి వాళ్లు మన కోసం ఇలా ఇడ్లీలు పంపిస్తారు.. సత్యదేవ్, బ్రహ్మాజీ, హర్ష ఆయన మీకు ఎప్పుడైనా ఇలా పంపించారా? చూశారా? నేను మాత్రమే ఆయనకు ఫేవరేట్ అని ప్రియాంక జవాల్కర్ తన గురించి గొప్పగా చెప్పుకుంది. కానీ అంతలోనే బ్రహ్మాజీ ఆమె గాలి తీసేశాడు. ఆయన నాకు బిర్యానీ పంపిస్తాడు.. అని చెప్పేసి ఆమె పరువుతీసేశాడు. తిమ్మరుసు సినిమా కరోనా సెకండ్ వేవ్ తరువాత విడుదలైంది. సినిమాకు టాక్ బాగానే వచ్చినా కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. సత్య దేవ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. డైరెక్టర్‌కు కూడా మంచి పేరు వచ్చింది. కానీ కమర్షియల్‌గా అప్పుడున్న పరిస్థితుల్లో లాభాలు మాత్రం రాలేదని తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాత మహేష్ ఎస్ కోనేరు ఇటీవలె గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ప్రియాంక చేతిలో ఇప్పుడు బోలెడన్ని ప్రాజెక్ట్‌లున్నాయి. ఇక సత్యదేవ్ అయితే ఏకంగా బాలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wBFieZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...