Sunday, 7 November 2021

‘జయమ్మ’కు అండగా కదిలిన తారలు!.. సుమక్క కోసం వంటలక్క, డాక్టర్ బాబు

ఒకప్పుడు సీరియల్స్, సినిమాల్లో నటించేది. కాలక్రమేణ వెండితెరకు, నటనకు దూరంగా.. హెస్టింగ్‌, యాంకరింగ్‌కు దగ్గర అయింది. చివరకు అందులోనే ఇన్నేళ్లు జీవించేసింది. యాంకర్, హోస్ట్‌గా సుమకు ఇండస్ట్రీలో తిరుగులేదు. అలాంటి సుమ ఇప్పుడు ఓ ప్రయోగాన్ని చేసేందుకు రెడీ అయింది. ఇన్నాళ్లు మనం సుమను నవ్వుతుంటేనో.. నవ్విస్తుంటేనో చూశాం. కానీ సుమ తనలోని ఇంకో కోణాన్ని చూపించేందుకు రెడీ అయింది. అందులో సుమ ఎంతగా సక్సెస్ అవుతుందో చెప్పలేం. కానీ ప్రయోగం చేసేందుకు ముందుకు వచ్చింది. అంటూ సుమ ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయిందట. ఎప్పుడు మొదలుపెట్టారు.. ఎక్కడ షూట్ చేశారు.. అసలు ఆ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఒక్క వార్త కూడా బయటకు రాకపోవడం కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ అది నిజమంట. షూటింగ్ పూర్తయిన ఈచిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ మేరకు ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు. రామ్ చరణ్ చేతుల మీద సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేయించారు. మొత్తానికి సుమ ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోందంటే అందరికీ అంచనాలు ఓ స్థాయిలోఉంటాయి. కానీ సుమను ఇంత వరకు ఎంతో ఫన్నీగా చూసి ఉంటాం. అలాంటి సుమ సీరియస్‌గా నటించి మెప్పిస్తుందా? అన్నది చూడాలి. సుమ నటించిన జయమ్మ పంచాయితీ పోస్టర్‌ను కార్తీకదీపం , ప్రేమి విశ్వనాథ్ వంటి వారు పోస్ట్ చేశారు. సుమక్క సినిమాను ప్రమోట్ చేశారు. వీళ్లే కాకుండా చాలా మంది బుల్లితెర తారలు సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. గెటప్ శ్రీను, శ్రీముఖి, వైవా రాఘవ, మిర్చి హేమంత్ ఇలా కొందరు సినిమా మోషన్ పోస్టర్ మీద రియాక్ట్ అయ్యారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CWxW7X
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...