Wednesday, 17 November 2021

తొలి అనుభవం గురించి చెప్పమన్న నెటిజన్.. అనుపమ షాకింగ్ కామెంట్స్

కేరళ బ్యూటీ సోషల్ మీడియాలో తన అభిమానులతో నిత్యం టచ్‌లోనే ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా తన ఫ్యాన్స్‌తో ముచ్చట్లు పెడుతుంది. వారి చిలిపి ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. ఎవరైనా హద్దులు మీరి ప్రశ్నలు సంధిస్తే.. అదే రీతిలో వారికి కౌంటర్లు వేస్తుంటుంది. అయితే తాజాగా మరోసారి తన ఇన్ స్టాగ్రాంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ పెట్టేసింది. ఇందులో అభిమానులు రెచ్చిపోయారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా అడిగేశారు. నీ మాతృభాష ఏంటి? నీకు తెలుగులో మాట్లాడటం ఇష్టమా? లేదంటే మళయాంలో మాట్లాడటం అంటే ఇష్టమా? నీకు ఇష్టమైన పాట ఏంటి? ప్రస్తుతం చేస్తోన్న సినిమాల లిస్ట్ ఏంటి? అంటూ ఇలా రకరకాల ప్రశ్నలు సంధించారు. వాటన్నంటికి సమాధానం చెప్పేసింది అనుపమా. మళయాలం అన మాతృభాష అని, అన్నింటికంటే కళ్లతో మాట్లాడే భాష నాకు చాలా ఇష్టం అది నాకు బాగా తెలుసు అని తెలిపింది. రౌడీ బాయ్స్, కార్తీకేయ 2, 18 పేజీలు, తల్లిపొగతే వంటి సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇంకా కొన్నిసినిమాలున్నాయి. కానీ ఇప్పుడే వాటి గురించి చెప్పలేను అని ఇలా తన అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఓ అభిమాని తొలి అనుభవం గురించి అడిగాడు. మొదటిసారిగా ఆడిషన్‌కు వెళ్లిన నాటి అనుభవం గురించి చెప్పమని అన్నాడు. దాని గురించి ఇప్పుడు ఆలోచించినా కూడా ఎంతో నర్వస్‌గా ఉంటుందని అంది. రామ్ అంటే తన ఫ్రెండ్ అని, పునీత్ రాజ్ కుమార్ వంటి వ్యక్తితో పని చేసే అదృష్టం రావడం ఈ జన్మకు దొరికిన వరమని, ఆయన ఎంతో మంచి వారు అంటూ అనుపమ ఎమోషనల్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cBmrYh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...