Tuesday, 9 November 2021

అఫీషియల్: ‘భోళా శంకర్’లో తమన్నా ఫిక్స్.. చిరుతో రొమాన్స్‌పై మిల్కీ బ్యూటీ క్రేజీ ఫీలింగ్స్

ప్రస్తుతం సీనియర్ హీరోలకు బెటర్ ఛాయిస్ అవుతున్న ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ అఫీషియల్ ప్రకటన ఇచ్చింది చిత్రయూనిట్. మెగాస్టార్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో రూపొందుతున్న '' సినిమాలో ఆయనతో రొమాన్స్ చేయబోతోంది తమన్నా. తమిళంలో సూపర్ హిట్ సాధించిన ‘వేదాళం’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ నెల 11న పూజా కార్యక్రమాలతో అఫీషియల్‌గా లాంచ్ చేసి 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. తాజాగా తమన్నాను హీరోయిన్‌గా కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు తమన్నాకు వెల్‌కమ్ చెబుతూ 'భోళా శంకర్' కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని తమన్నా కూడా తెలుపుతూ చిరంజీవితో తెర పంచుకోనుండటం గౌరవంగా భావిస్తున్నా అంటూ తన మనసులో మాట చెప్పింది. గతంలో చిరంజీవితో కలిసి ‘సైరా నరసింహారెడ్డి’ మూవీలో నటించింది తమన్నా. అది ఫుల్ లెంగ్త్ రోల్ కాకపోయినా చిరుతో మ్యాజిక్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సారి చిరంజీవి సరసన ఆమె ఫుల్ లెంగ్త్ పోషిస్తుండటం మెగా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. చిరంజీవి, తమన్నా ఇద్దరూ బెస్ట్ డాన్సర్స్ కావడంతో ఈ సినిమాలో వాళ్ళిద్దరి హుషారెత్తించే స్టెప్స్ చూడొచ్చని ఆనంద పడుతున్నారు ఫ్యాన్స్. ఇకపోతే ఈ సినిమా కోసం తమన్నా భారీగా పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. దాదాపు 3 కోట్ల రూపాయలు ఆమె పుచ్చుకుంటోందట. పక్కా ప్రణాళికతో తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా స్క్రిప్ట్ రూపొందిచారట మెహర్ రమేష్. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమెర్షియల్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీలో చిరంజీవి సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/304lt3I
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...