Tuesday, 16 November 2021

ఇది చాలా స్పెషల్ అంటున్న విజయ్ దేవరకొండ.. మైక్ టైసన్‌తో రౌడీ స్టార్.. పిక్ వైరల్

టాలీవుడ్ రౌడీ స్టార్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’. ''సాలా క్రాస్ బ్రీడ్'' అనే ట్యాగ్ లైన్‌తో బాక్సింగ్ నేపథ్యంలో భారీ రేంజ్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ను కీలకపాత్ర కోసం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సెట్స్ మీదకు వచ్చేశారు . ప్రస్తుతం అమెరికాలో లైగర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల ప్రారంభమైన షెడ్యూల్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ- మైక్ టైసన్ కాంబోలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. ఈ సందర్బంగా తొలిసారి మైక్ టైసన్‌‌ని కలిసిన విజయ్ దేవరకొండ ఎంతో ఎగ్జైట్ అవుతూ ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఆయనతో కలిసిన దిగిన పిక్ షేర్ చేస్తూ ఈ క్షణాలు జీవితంలో ఎప్పటికీ మరువలేనివని చెప్పారు. ఎప్పుడూ ఇవి ప్రత్యేకం అని పేర్కొన్నారు. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ లైగర్ సినిమా నిర్మాణంలో ఛార్మి భాగమవుతోంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పోషిస్తోంది. రియాలిటీకి దగ్గరగా ఉండేలా కనిపించడానికి విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా థాయ్‌లాండ్‌లో బాక్సింగ్ శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ సినిమాకి వరల్డ్ వైడ్‌గా హైప్ తీసుకురావడంలో భాగంగా ఇందులో ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌‌తో కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తున్నారని టాక్. వచ్చే ఏడాది గ్రాండ్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DnJlxN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...