Saturday, 27 November 2021

బాలయ్య బాబు ఆటంబాంబ్.. రాజమౌళి కామెంట్స్ వైరల్

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమా మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. సింహా, లెజెండ్ తరువాత ముచ్చటగా మూడో సారి హిట్ కొట్టేందుకు వస్తున్నారు. డిసెంబర్ 2న రాబోతోన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైద్రాబాద్‌లో ని శిల్పా కళా వేదికలో జరిగింది. ఈ ఈవెంట్‌కు , అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈవెంట్‌లో చిత్రయూనిట్ పాల్గొంది. ఈ చిత్రంలోని మాస్ సాంగ్‌ను రాజమౌళి రిలీజ్ చేశాడు. అనంతరం రాజమౌళ్లి మాట్లాడుతూ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక బాలయ్య ఎనర్జీలు, బోయపాటి సీక్రెట్లపై కామెంట్ చేశాడు. ‘బోయపాటి గారు థ్యాంక్స్. ఈ ఆడిటోరియంకే కాకుండా.. మొత్తం ఇండస్ట్రీకి ఊపును తీసుకొచ్చారు. డిసెంబర్ 2 నుంచి అన్ని థియేటర్లో అందరికీ ఇంతే ఆనందం.. తెలుగు వాళ్లకు ఇంత ఆనందం రావాలి.. రావాలి కాదు.. వస్తుంది. కచ్చితంగా చెబుతున్నాను.. బాలయ్య బాబు ఆటంబాంబ్.. దాన్ని ఎలా ప్రయోగించాలో బోయపాటి గారికి తెలుసు.. ఆ సీక్రెట్ అందరికీ చెప్పాలి.. ఆయన ఆ సీక్రెట్ ఎలా చెబుతాడో..మీరు కూడా మీ సీక్రెట్ చెప్పాలి. ఆ డ్యాన్స్ ఏంటి.. ఆ ఎనర్జీ ఏంటి.. ఇది కేవలం మచ్చుతునకే.. ఫస్ట్ డే ఫస్ట్ షో.. నో వేర్ ఎల్స్.. థియేేటర్లో. పెద్ద హిట్ అవ్వాలి.. ఇండస్ట్రీకి మంచి ఊపు రావాలి.. తమన్ మంచి సాంగ్స్ ఇచ్చావ్.. నిర్మాతకు థ్యాంక్స్’ అని అన్నారు..


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/317xwOc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...