Tuesday, 16 November 2021

చేతులు జోడించిన నాగలక్ష్మి.. టోటల్‌గా రివీల్ చేసేది అప్పుడేనంటూ ఆసక్తిరేపిన నాగ చైతన్య

అక్కినేని నాగార్జున- కళ్యాణ్ కృష్ణ కురసాల కాంబోలో గతంలో వచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వల్‌గా '' మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక మూవీలో కొడుకు, యంగ్ హీరో కూడా భాగమవుతున్నారు. కృతి శెట్టిని సెకండ్ హీరోయిన్‌గా తీసుకున్నారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగ చైతన్య జంటగా నటిస్తోంది. నాగలక్ష్మిగా కృతి కనిపించనుంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన కీలక అప్‌డేట్ ఇచ్చారు నాగ చైతన్య. ముఖం కనిపించకుండా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న నాగలక్ష్మి పోస్టర్ షేర్ చేస్తూ ఫుల్ పిక్చర్ నవంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల 18 నిమిషాలకు రివీల్ చేయనున్నట్లు పేర్కొన్నారు నాగ చైతన్య. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. దీంతో ఈ పోస్టర్ చూసి 'ఉప్పెన' బ్యూటీ ఫుల్ లుక్ కోసం ఆతృతగా ఉన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. నాగార్జుననే నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్‌తో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని పేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. బంగార్రాజుగా నాగార్జున నటిస్తుండగా, ఆయన భార్య సత్యభామ రోల్‌లో రమ్యకృష్ణ స్పెషల్ అట్రాక్షన్ కానుంది. చిత్రంలో చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన 'బంగార్రాజు' అప్‌డేట్స్ సినిమాపై హైప్ పెంచేశాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3os6ZDa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...