బాలీవుడ్ నటి, స్టార్ హీరోయిన్ తల్లి అయింది. తన అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది. సరోగసి (అద్దె గర్భం) విధానంలో కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు ఆమె పేర్కొంది. తాను, జీన్ తల్లిదండ్రులయ్యామని పేర్కొంటూ తన ఆనందాన్ని పంచుకుంది ప్రీతి జింటా. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో భర్త జీన్‌తో కలిసి దిగిన ఫొటో షేర్ చేసిన ప్రీతి జింటా.. తన పిల్లల పేర్లను చెప్పేయడం విశేషం. ''అందరికి నమస్కారం. ఈ రోజు మా జీవితాల్లో నెలకొన్న గొప్ప ఆనందకర వార్తను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. జీన్, నేను కవలలకు జన్మనిచ్చాం. సరోగసి ద్వారా కవలలను ( జై జింటా, గియా జింటా) మా కుటుంబంలోకి స్వాగతించాం. మా అద్బుతమైన జర్నీలో భాగమై సహకరించిన డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా'' అని ట్యాగ్ చేసింది ప్రీతి జింటా. ఆమె పెట్టిన ఈ పోస్ట్ చూసి నెటిజన్లు పెద్దఎత్తున కంగ్రాట్స్ చెబుతున్నారు. భర్తకు డబుల్ గిఫ్ట్ ఇచ్చావుగా అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 1998లో 'దిల్ సే' మూవీతో సినీ గడప తొక్కి ఎన్నో సూపర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది ప్రీతి జింటా. ప్రేమంటే ఇదేరా సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా టచ్ చేసి హుషారెత్తించింది. వ్యాపార రంగంలోనూ తన మార్క్ చూపిస్తూ తొలి మహిళా ఐపీఎల్ జట్టు ఓనర్‌గా గుర్తింపు పొందింది. ఇక అమెరికాకు చెందిన బిజినెస్‌మెన్ జీన్ గుడ్‌ఎనఫ్‌తో ప్రేమలో పడి 2016 సంవత్సరంలో ఆయన్ను సీక్రెట్‌గా పెళ్లాడింది. ఆ తర్వాత అమెరికాలోనే స్థిరపడ్డ ఆమె ఇప్పుడు కవల పిల్లలకు జన్మనిచ్చింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FsLOrC
v
No comments:
Post a Comment