Tuesday, 26 October 2021

Vijay Deverakonda: రిలేషన్స్ విషయమై దేవరకొండ బ్రదర్స్ ఓపెన్.. ఏకంగా 40, 50 అంటూ!!

ప్రతి ఒక్కరి జీవితంలో రిలేషన్స్ అనేవి ప్రధానం. మనిషికి మనిషికి మధ్య ఉన్న కమ్యూనికేషన్ జీవితంలో ఎన్నో రకాలుగా హెల్ప్ అవుతుంటుంది. అయితే ఏజ్‌ని బట్టి ఆ రిలేషన్స్ పలు రకాలుగా ఉంటాయి. తాజాగా ఈ రిలేషన్స్ విషయమై దేవరకొండ బ్రదర్స్ ఓపెన్ అయ్యారు. తమ్ముడు హీరోగా రూపొందిన ‘’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సోదరులిద్దరూ సరదాగా మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. కార్యక్రమంలో భాగంగా ఎక్కువ రిలేషిప్స్‌ ఎవరికి ఉన్నాయి? అనే ప్రశ్నకు బదులిస్తూ విజయ్‌‌కి దగ్గర దగ్గర 30, 40, 50 వరకు ఉన్నాయని ఆనంద్ అన్నారు. అన్నయ్యకు సినిమాల్లోకి రావడానికే ముందు నుంచే చాలా రిలేషన్స్‌ ఉన్నాయని ఆయన చెప్పారు. ఆ తర్వాత దీనిపై విజయ్‌ రియాక్ట్ అవుతూ.. తాను కెరీర్‌ కోసం ఎక్కువగా ఆలోచించేవాడినని, అలా సమయం దొరకక చాలా రిలేషిప్స్‌ బ్రేక్‌ అయ్యేవని చెప్పారు. అయితే ఆనంద్‌ మాత్రం రిలేషన్‌ల్లో చాలా సీరియస్‌గా ఉంటాడని, ప్రేమిస్తే ఇక పెళ్లి చేసుకోవడమే.. తాను మాత్రం అలా కాదని అన్నారు. అలాగే తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు ఈ సోదరులు. ఇద్దరం కలిసి ఆడుకునే సమయంలో గొడవపడే వాళ్లమని, ఇద్దరికీ వేరు వేరుగా బొమ్మలు కొనిచ్చినా ఆనంద్ తన బొమ్మలు లాక్కునే వాడని విజయ్ చెప్పారు. టీవీలో వాడికి నచ్చిందే చూడాలి. రీమోట్‌ తనకు కావాలంటూ అల్లరి చేసేవాడని విజయ్ అన్నారు. ఇక పుష్పక విమానం సినిమా విషయానికొస్తే.. ఆనంద్ దేవ‌ర‌కొండ మూడో సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. డార్క్ కామెడీ మూవీగా కింగ్ ఆఫ్ ది హిల్స్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాకు దామోద‌ర అనే నూత‌న ద‌ర్శ‌కుడు దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవ‌ర‌కొండ సరసన శాన్వి మేఘ‌న‌, గీత సైనీ హీరోయిన్లుగా నటించారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZzPfgy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...