Tuesday, 26 October 2021

ఆదిపురుష్ లేటెస్ట్ అప్‌డేట్: ఆయన దృష్టి మొత్తం రాముడి పైనే.. ప్రభాస్ బిజీ బిజీ!!

యంగ్ రెబల్ స్టార్ స్పీడు మాములుగా లేదండోయ్. వరుసపెట్టి భారీ బడ్జెట్ సినిమాలకు కమిటైన ఆయన ఒక్కొక్కటిగా అన్నిటినీ చకచకా ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు క్షణం తీరిక లేకుండా ఒప్పుకున్న అన్ని సినిమాలకు డేట్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ లేటెస్ట్ మూవీ '' నుంచి ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతోంది 'ఆదిపురుష్' మూవీ. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని ఎంచుకున్నారు. పౌరాణిక గాథ రామాయణంను ఈ 'ఆదిపురుష్' రూపంలో చూపించనున్నారు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండటం ఆయన అభిమానుల్లో పట్టలేని ఆతృతను నింపేసింది. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్, ఇతర అప్‌డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేయడంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఎదురుచూపులు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల నడుమ 'ఆదిపురుష్' యూనిట్ వేగం పెంచింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 11న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తామని ఇప్పటికే దర్శకుడు ఓం రౌత్ చెప్పారు. అందుకు తగ్గట్లుగానే షూటింగ్ శరవేగంగా ఫినిష్ చేస్తున్నారు. ఇప్పటికే సీత రోల్ పోషిస్తున్న కృతి సనన్, రావణుడిగా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ షూటింగ్ కంప్లీట్ చేసిన ఆయన.. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న రాముడి పాత్రపై ఫుల్ ఫోకస్ పెట్టారట. ఓ పక్క చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుపుతూనే, అదే సమయంలో ప్రభాస్‌కు సంబంధించిన షూటింగ్ నాన్ స్టాప్‌గా జరుపుతున్నారట. ప్రస్తుతం చివరి షెడ్యూల్ నడుస్తోందని, వచ్చే నెలాఖరు లోపు ప్రభాస్ పార్ట్ షూట్ పూర్తి చేయాలని ఓం రౌత్ టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించి టీ సిరీస్ బ్యానర్‌పై ఐదు భాషల్లో ఈ ఆదిపురుష్ సినిమా రూపొందిస్తున్నారు. ఈ మూవీపై ప్రభాస్ అభిమానుల్లో బోలెడన్ని అంచనాలున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZlBkKS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...