Wednesday, 20 October 2021

Sarkaru Vaari Paata : చిన్న వీడియోతో హైప్ పెంచేసిన తమన్

టాలీవుడ్‌లో ప్రస్తుతం శకం నడుస్తోంది. తమన్ చేతిలో అన్నీ కూడా పెద్ద ప్రాజెక్ట్‌లే ఉన్నాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవి వంటి హీరోల సినిమాలతో తమన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇక ఏ చిత్రానికి అదే స్పెషల్ అన్నట్టుగా తమన్ పని చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందులోనూ తమన్ కాంబినేషన్ అంటే అందరూ దూకుడు సినిమాను మించి ఉండాలని భావిస్తారు. అభిమానులు అయితే బలంగా ఫిక్స్ అయిపోయారు. దూకుడును మించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలని తమన్‌కు రిక్వెస్ట్‌లు పెడుతుంటారు. అయితే తమన్ తన ప్రేమను చూపించేలా మ్యూజిక్‌ను స్పెషల్‌గా ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే వదిలిన మోషన్ పోస్టర్, చిన్నపాటి గ్లింప్స్‌లతో తమన్ అదరగొట్టేశాడు. అయితే ఇప్పుడు తమన్ అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. అసలే సర్కారు వారి పాట గురించి కొన్ని రోజులుగా ఓ విషయంలో ట్రెండ్ అవుతోంది. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రాబోతోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో తమన్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. తమన్ వేసిన ట్వీట్‌ను, అందులో క్రాక్స్ అంటూ వదిలిన చిన్న పదాన్ని చూస్తే దీపావళికి అప్డేట్ రాబోతోన్నట్టు కనిపిస్తోంది. అది కూడా సర్కారు వారి పాట అంటూ టైటిల్ సాంగ్ రాబోతోన్నట్టు చెప్పకనే చెప్పేశాడు. రోజూ ఈ పాట వింటుంటూ నా స్పీకర్లు భయపడుతూ ఉంటాయి.. ఇది కచ్చితంగా మీ స్పీకర్‌లను క్రాక్ చేసి పడేస్తుందని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఫస్ట్ సింగిల్‌తో మహేష్ బాబు అభిమానుల ఆకలి తీరేలా కనిపిస్తోంది. ఇక తమన్ తన కీబోర్డ్ వాయించిన తీరును చూస్తే ఈసారి హైపిచ్‌లో కొట్టేసినట్టు కనిపిస్తోంది. , మహేష్ బాబు కాంబోలో రాబోతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దించేందుకు డైరెక్టర్ పరుశురామ్ ప్లాన్ చేసేశాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Z7VDuR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...