Sunday, 24 October 2021

మెగా, నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. RRR టీజర్ అప్పుడే! గెట్ రెడీ ఫ్యాన్స్

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చాటి చెప్పారు దర్శక ధీరుడు . ఆ తర్వాత అదే స్థాయిలో మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. యంగ్ టైగర్ , మెగా పవర్ స్టార్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీ పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరకు వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయాలనీ ఫిక్సయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన RRR పోస్టర్స్, ఫస్ట్‌ సింగిల్‌ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాయి. విడుదలకు చాలా రోజుల ముందే రికార్డుల తలపులు తెరిచేసి RRR స్టామీనా ఏంటనేది నిరూపించాయి. దీంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ అంతా ఈ మూవీ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజర్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ టీజర్‌ని అక్టోబర్ 29వ తేదీన విడుదల చేయడానికి రాజమౌళి టీం సన్నాహాలు చేస్తోందని టాక్ నడుస్తోంది. దీంతో ఒక్కసారిగా అందరి చూపు ఆ డేట్‌పై పడింది. పాన్‌ ఇండియా మూవీగా రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. డీవీవీ దానయ్య సమర్పిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీంగా ఎన్టీఆర్‌ కనిపించనుండటం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తుండగా అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రీయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZiA3E4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...